చలిలో పవన్ 'పులి'
టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు హీరోయిన్ నిక్కిషా పటేల్ నటిస్తోన్న తాజా చిత్రం కనకరత్న మూవీ బ్యానర్ లో "కొమరం పులి" ప్రారంభమైంది ఈ చిత్ర దర్శకుడు స్నాగనమల రమేష్ "ఖుషి" చిత్రాన్ని రూపొందించిన ఎస్.జె.సూర్య మళ్ళీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మ్యూజిక్ ను ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎ.ఆర్. రెహమాన్ అందించనున్నారు. క్వాలిటీపరంగానే ఈ సినిమా షూటింగ్‌కు ఎక్కువ కాలం పట్టిందని దర్శకుడు సూర్య వెల్లడించారు.
ఈ సందర్భంగా దర్శకుడు ఈ సినిమా గురించి చెబుతూ..పులి ఎంతటి పవర్‌ఫుల్లో ఇందులో హీరో పవన్‌కళ్యాణ్ కూడా అంతటి పర్‌ఫుల్ రోల్ చేస్తున్నాడని చెప్పారు. పవన్ కళ్యాణ్ లో డెడికేషన్ ఎంతో నచ్చిందని సూర్య కితాబిచ్చాడు. తమ కాంబినేషన్‌కు టాలీవుడ్ మంచి క్రేజ్ లభించిందని దర్శకుడు అన్నారు.
ఇప్పటికే బిజినెస్‌పరంగా ఆశాజనకంగా ఉన్న ఈ చిత్రాన్ని, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని దీపావళికి విడుదల కావల్సిఉండగా, డిసెంబర్ 19కి విడుదలకు సిద్దం చేస్తామని దీనికి ప్రేక్షకులు వరీ చేందాల్సిన అవసరం లేదని తరువాతి చిత్రం కూడ హరీష్ శంకర్ దర్శకత్వంలో నిర్మాత గనేష్ బాబు త్వరలో మరో చిత్రం ప్రారంభించనున్నారని సూర్య తెలిపారు. ఈ చిత్రంలో నాజర్, జోతి క్రిష్ణ, సరణ్య, బ్రంహ్మాజీ, ఆలీ, కోవై సరళ, గిరీష్ ఖర్నాడ్ నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











