చిగురించిన చిరు, మోహన్ బాబు స్నేహం మళ్ళీ బెడిసికొట్టేనా..
జూలైలో రెండు తెలుగు సినిమాలు విడుదల కానున్నాయి. తెలుగు ఇండస్ర్టీ మొత్తం ఈ రెండు సినిమాల మీదే ఆసక్తి చూపిస్తున్నాయి. అదే ఒకటి "పులి'. "రెండవది "ఝంమ్మందినాధం'. పవన్ కల్యాణ్ నటించిన సినిమా రెండు సంవత్సరాలుగా విడుదలకు ఏదురు చూస్తుంది. ఎస్ జె సూర్య కసిగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. అదే విదంగా ప్రేక్షకులు ఈ సినిమా కోసం వెయ్యి కళ్ళతో ఏదరు చూస్తున్నారు. దీనికి తోడు సినిమా సంగీత దర్శకుడు "ఆస్కార్' అవార్డు గ్రహీత "ఎఆర్ రెహమాన్' కావడంతో సినిమాపై అంచనాలు పెరిగి పోయాయి. బయ్యర్లు పోటి పడి ఈ సినిమా హక్కులను సోంతం చేసుకున్నారు. అదే విందగా పవన్ పాత్ర వైవిద్యంతో అభిమానులను ఆకట్టుకుంటుందని ఇప్పటికే చిత్ర యానిట్ సభ్యులు అన్నారు. ఇన్ని హంగులతో ఈ సినిమా జాన్ మొదటి వారంలో "సిల్వర్ స్కీన్ 'పై దర్శనం ఇవ్వనుంది. అదే విదంగా కోంత కాలంగా పవన్ సినిమాలు రాక నిరాశతో వున్న ఆయన అభిమానులు ఆకలితో వున్నారు.
మరో సినిమా "ఝంమ్మంది నాధం'. అచ్చ తెలుగు సంగీత భరిత చిత్రం. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు, కిరవాణి కలయికలో వస్తున్న మరో మ్యూజికల్ హిట్ సినిమా అని సినీ వర్గాలు అంటున్నాయి. దీనికి తోడు మోహన్ బాబు ఒక అడుగు వెనక్కి వేసి తన కుమార్తెను నిర్మాతగా పరిచయం చేస్తున్నారు. ఇంతకు ముందు అల్లుడు గారు, అల్లరి మోగుడు సినిమాలతో మోహన్ బాబు సినీ జీవితాన్ని మలుపు తిప్పిన రాఘవేంద్ర రావు కోంత కాలంగా హిట్ కోసం ఏదురు చూస్తున్న మంచు మనోజ్ కుమార్ కు భారి హిట్ ఇస్తారని సినీ పండితులు అంటున్నారు. "లక్ష్మి ప్రసన్న' ఎక్కడా కాంప్రమైజ్ కాకుండ ఈ సినిమాను తెరకెక్కించి ఇప్పటికే అందరి ఆశిస్సులు తీసుకున్నారు. ఈ సినిమా ఆడియో వేడుకలకు మేగా స్టార్ చిరంజీవి హజరై సినీ వర్గాలకు "జలక్' ఇచ్చారు. ఏప్పుడు ఏడమోహం......పెడమోహం పెట్టుకునే మోహన్ బాబు, చిరంజీవి ఓకటి అయ్యారు అని సినీ వర్గాలు భావించాయి. అలాంటి వేదిక అయ్యంది ఝమ్మంది నాధం ఆడియో వేడుకలలో. ఇప్పుడు పులి, ఝమ్మంది నాధం సినీమాలు కేవలం వారం రెండువారాల వ్యవదిలో విడుదల కానున్నాయి. రెండు సినీమాలు జూలై 15 లోపు విడుదల చేయాలని నిర్ణయించారు. రెండు సినీమాలో ఏది హిట్ అవుతంది అంటే వేచి చూడాలని సినీ వర్గాలు అంటున్నాయి. ఏసినిమాకు ఏసినిమా పోటి కాదని కోందరు అంటున్నారు. ఇప్పుడిప్పుడే ఏదుగుతున్న మనోజ్ సినిమా స్టార్ ఇమేజ్ వున్న పవన్ సినీమా ముందు విడదల చేయటం ఏమిటి అని అంటున్నారు. సినీమా మీద నమ్మకం అలాంటిది అని కోందరు అంటున్నారు. ఇప్పుడిప్పుడే కలుస్తున్న చిరు, మోహన్ బాబులు ఈవిషయంపై ఏలాంటి కామెంట్ చేస్తారో వేచి చూడాలి మరి......?


Click it and Unblock the Notifications











