ఆది పినిశెట్టి, తాప్సీ మూవీ లాంచ్ చేయబోతున్న నాని
కోన ఫిల్మ్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమా బేనర్లో నాని హీరోగా తెరకెక్కిన 'నిన్ను కోరి' చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయం అందుకుంది. ఈ చిత్రం అందించిన విజయంతో మరో సినిమాకు సిద్ధమవుతున్నారు చిత్ర నిర్మాతలు.
ఆది పనిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ హీరో హీరోయిన్లుగా కోన ఫిల్మ్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమా వారు మరో సినిమా నిర్మించబోతున్నారు. ఈ మూవీ అనౌన్స్‌మెంట్ ఈవెంట్ మే 24న చేయబోతున్నారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటించనున్నారు.

ఈ కార్యక్రమానికి నేచురల్ స్టార్ నాని ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. నాని చేతుల మీదుగా ఉదయం 11:11 గంటలకు ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ లోగో విడుదల చేయబోతున్నారు.
'నిన్ను కోరి' మూవీలో ఆది పినిశెట్టి కీలకమైన పాత్రలో నటించారు. ఆ సమయంలోనే ఆది హీరోగా సినిమా చేయాలని నిర్మాతలు కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ ఫిక్స్ అయ్యారు. ఆ మూవీ తర్వాత ఆది పినిశెట్టి 'అజ్ఞాతవాసి', 'రంగస్థలం' సినిమాలతో బిజీ అయిపోయారు. ఇపుడు అంతా సెట్టవ్వడంతో ఆది హీరోగా మరో సినిమా ప్రారంభించేందుకు రంగం సిద్ధమైంది.


Click it and Unblock the Notifications











