ఆమె లేడీ మణిరత్నం: కోన వెంకట్
''ఇదొక సెన్సిటివ్ లవ్‌స్టోరి. తెలుగు పరిశ్రమ గర్వించదగ్గ చిత్రం అవుతుంది. బెల్లంకొండ అభిరుచికి తగ్గ కథ ఇది. నందినీరెడ్డిని లేడీ మణిరత్నం అనొచ్చు'' అని ప్రముఖ రచయిత కోన వెంకట్ అన్నారు. సిద్ధార్థ్,సమంత కాంబినేషన్ లో నందనీరెడ్డి దర్శకత్వంలో రూపొందే చిత్రం ప్రారంభం సందర్బంగా ఆయన ఇలా స్పందించారు. బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రం గురించి హీరో సిద్దార్ద మాట్లాడుతూ...'నందిని దర్శకత్వంలో సినిమా చేయడం ఆనందంగా ఉంది. ఆమె చెప్పిన కథ నచ్చింది. కచ్చితంగా ఓ మంచి చిత్రం అవుతుందన్న నమ్మకం ఉంది. అలాగే లేడీ డెరైక్టర్‌తో సినిమా చేయడం నాకిదే మొదటిసారి. నందినీరెడ్డి దర్శకత్వం వహించిన మొదటి సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రం కూడా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది అన్నారు.
దర్శకురాలు నందినీరెడ్డి మాట్లాడుతూ...'అలా మొదలైంది' చిత్రానికి నాని, నిత్యమీనన్‌లని నాయకానాయికలుగా తీసుకోవడంతోనే సగం విజయం సాధించాను. ఈ చిత్రంలో సిద్ధార్థ్, సమంత కలిసి నటిస్తుండటంతో 70 శాతం విజయం దక్కినట్టే. అందరూ మెచ్చే సినిమా అవుతుందని ధీమాగా చెప్పగలను అంది. ఇక హీరోయిన్ సమంత మాట్లాడుతూ...''సిద్ధార్ధ్ మంచి నటుడు. అందుకే తనంటే నాకు గౌరవం. 'అలా మొదలైంది' చాలాసార్లు చూశాను. నందినీరెడ్డితో సినిమా చేయాలన్న నా కోరిక ఈ చిత్రంతో తీరుతున్నందుకు ఆనందంగా ఉంది'' అని చెప్పింది. ఈ చిత్రానికి మాటలు: వెలిగొండ శ్రీనివాస్, స్క్రీన్‌ప్లే: కోన వెంకట్, సంగీతం: తమన్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్‌ప్రొడ్యూసర్: బి.మహేంద్రబాబు.


Click it and Unblock the Notifications











