ట్యాంక్‌బండ్ వద్ద బీర్ కొడుతూ పోలీసులకు చిక్కిన కోన వెంకట్!
హైదరాబాద్: ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్ హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ వద్ద బీర్ కొడుతూ పోలీసులకు చిక్కారు. అయితే ఈ సంఘటన ఇప్పుడు జరిగింది కాదు. చాలా ఏళ్ల క్రితమే ఈ సంఘటన చోటు చేసుకుంది. తాజాగా ఈ సీక్రెట్‌ను తన ట్విట్టర్ ద్వారా బయట పెట్టారు.
'నాకు అప్పుడు 23 సంవత్సరాలు, గ్రేట్ రైటర్ ఆత్రేయగారితో నేను సన్నిహితంగా ఉండే వాడిని. ఆయనకు అప్పుడు 63 సంవత్సరాలు. ఆయనే నాకు మొదటి గురువు. ఒకసారి ఇద్దరం కలిసి ట్యాంక్ బండ్ వద్ద తెల్లవారు ఝామున 3 గంటలకు బీర్ కొడుతుండగా పోలీసులు వచ్చి పట్టుకున్నారు' అని ట్వీట్ చేసారు.
ఇటీవల వచ్చిన 'దూకుడు' చిత్రానికి అదరిపోయే స్ర్కిప్టు అందించిన కోన వెంకట్ ప్రస్తుతం...శ్రీను వైట్ల, జూ ఎన్టీఆర్ కాంబినేషన్లో రూపొందుతున్న 'బాద్ షా'చిత్రానికి పని చేస్తున్నారు. మరో ఆసక్తికర సమచారం ఏమిటంటే...ఈచిత్రం యూఎస్ రైట్స్ దక్కించుకునేందుకు కోన వెంకట్ ట్రై చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా ఇటీవల వెల్లడించారు. ''బాద్ షా యూఎస్ రైట్స్ కావాలని నిర్మాత బండ్ల గణేష్ ను అడిగా, రేటు పెద్ద మ్యాటర్ కాదు...ఆయన నుంచి పాజిటివ్ రిప్లై వస్తుందని ఆశిస్తున్నా...' అంటూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.
బాద్ షా ఛిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, గోపీ మోహన్, కోన వెంకట్ స్క్రిప్టు రచయితలుగా పని చేస్తున్నారు. ఎ.ఎస్.ప్రకాష్, ఎం.ఆర్.వర్మ, చలసాని రామారావు ఇతర సాంకేతిక నిపుణులుగా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీను వైట్ల.


Click it and Unblock the Notifications











