twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కళ్యాణ్ వివాదం: క్లారిటీ ఇచ్చిన రచయిత కోన వెంకట్, ఏం జరిగిందంటే?

    |

    Recommended Video

    Kona Venkat Clarifies Comments On Pawan Kalyan | Filmibeat Telugu

    జనసేన పార్టీ పెట్టక ముందు నుంచి, సినిమా రంగంలో ఉన్నప్పటి నుంచే పవన్ కళ్యాణ్‌, రచయిత కోన వెంకట్‌ మధ్య మంచి స్నేహం ఉంది. తాజాగా ఎన్నికల వేళ వైసీపీకి మద్దతుగా ప్రచారం చేస్తున్న కోన వెంకట్... వైజాగ్‌లో పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.

    సోషల్ మీడియాలో పవన్ అభిమానులు కోన వెంకట్ మీద విరుచుకుపడుతున్నారు. ఈ వివాదానికి సంబంధించి కోన వెంకట్ వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో తన ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ మొత్తం వెల్లడించడంతో పాటు, ఆ ఇంటర్వ్యూలో తాను మాట్లాడిన విషయాలపై క్లారిటీ ఇచ్చారు.

    నేను పుట్టక ముందు నుంచే

    నేను పుట్టక ముందు నుంచే

    సాక్షి పేపర్లో వచ్చిన నా ఇంటర్వ్యూకి సంబంధించి కొంత క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. మా కుటుంబం నేను పుట్టక ముందు నుంచే మా సొంత ఊరైన బాపట్లలో రాజకీయాల్లో ఉంది. మా తాతగారైన కోన ప్రభాకరరావుగారు కాంగ్రెస్ పార్టీలో పలుమార్లు ఎంఎల్ఏగా, మంత్రిగా, అసెంబ్లీ స్పీకర్‌గా, ఉమ్మడి రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రెసిడెంటుగా, మూడు రాష్ట్రాలకు గవర్నర్‌గా ఒక మచ్చలేని నాయకుడిగా తన రాజకీయ ప్రస్థానం కొనసాగించారు.

    మిత్రుడు పవన్ కళ్యాణ్ అభినందించారు

    మిత్రుడు పవన్ కళ్యాణ్ అభినందించారు

    ఆయన మరణం తర్వాత మా బాబాయ్ కోన రఘుపతి గారు 1995 నుంచి ప్రజాసేవలోకి రావడం జరిగింది. తన సొంత ఆస్తులు కరిగించుకుంటూ ప్రజాసేవలో కొనసాగారు. 2014 ఎన్నికల్లో మా కుటుంబానికి, కోన రఘుపతి గారికి ఉన్న ప్రజాదరణ గుర్తించిన జగన్ గారు వైఎస్ఆర్‌సీపీ తరుపున పోటీ చేసే అవకాశం ఇవ్వడం, గెలవడం జరిగింది. ఈ ఎన్నికల్లో నేను ప్రత్యక్షంగా పాల్గొని నా వంతు కృషి నేను చేశాను. 1983 తర్వాత తిరిగి 2014లో బాపట్లలో కోన కుటుంబాన్ని ప్రజలు ఆదరించారు. ఆ సందర్భంలోనూ మిత్రుడైన పవన్ కళ్యాణ్ కూడా ఆయన్ని అభినందించారు.

    పర్సనల్ లాయల్టీ వేరు, పొలిటికల్ లాయల్టీ వేరు

    పర్సనల్ లాయల్టీ వేరు, పొలిటికల్ లాయల్టీ వేరు

    2014 తర్వాత జనసేన పార్టీని బలోపేతం చేసే సందర్భంలో.. ప్రజల్లోకి తీసుకెళ్లే సందర్భంలో పలుమార్లు నేను ఓపెన్ గానే సపోర్ట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో వైసీపీ క్యాడర్ నుంచి కూడా లోకల్‌గా విమర్శలు ఎదుర్కొన్నాను. అయినా ఒక మిత్రుడిగా, పవన్ కళ్యాణ్ శ్రేయోభిలాషిగా అతడికి మంచి జరుగాలని ఆశించి మౌనంగా ఉండిపోయాను. అది నా వ్యక్తిగతం అనే చెప్పాను. నా పర్సనల్ లాయల్టీ వేరు, నా పొలిటికల్ లాయల్టీ వేరు. 30 సంవత్సరాల తర్వాత మా కుటుంబాన్ని నమ్మి ఆదరించింది వైసీపీ పార్టీ, జగన్ గారు. అది మేము ఎప్పటికీ మరిచిపోలేము.

    అందుకే వైజాగ్ వెళ్లాను

    అందుకే వైజాగ్ వెళ్లాను

    ఇక నా ఇంటర్వ్యూ సంగతికి వస్తే.. మా బావగారైన ద్రోణంరాజు శ్రీనివాస్ గారు వైజాగ్ దక్షిణ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అలాగే నా మిత్రుడైన ఎంవివి సత్యనారాయణ వైజాగ్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వీరిద్దరికీ ప్రచారం చేయ్యడానికి వైజాగ్ వెళ్లడం జరిగింది. అప్పుడు సాక్షి పేపర్ వారు నన్ను ఇంటర్వ్యూ చేశారు. ఆ సందర్భంగా పలు విషయాలపై నా అభిప్రాయాలు ఖచ్చితంగా చెప్పాను.

    పవన్ గురించి నేను చెప్పిన ఆ విషయాలు రాయలేదు

    పవన్ గురించి నేను చెప్పిన ఆ విషయాలు రాయలేదు

    ఈ ఇంటర్వ్యూలో నా మిత్రుడైన పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా అడగటం జరిగింది. తన నిజాయితీ గురించి, తన వ్యక్తిత్వం గురించి దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా నిర్మొహమాటంగా చెప్పాను. పొలిటికల్ గా తనకి మంచి జరుగాలని కోరుకునే వాళ్లలో నేను మొదటి వ్యక్తిని అని చెప్పడం కూడా జరిగింది. కానీ వారు ఆ విషయం రాయలేదు.

    అందుకే నాకు అనుమానం వచ్చింది

    అందుకే నాకు అనుమానం వచ్చింది

    పొలిటికల్‌గా మీరు విబేధించే అంశాలు ఉన్నాయా అని అడిగినపుడు మాయావతిగారితో పొత్తు విషయంలో, తెలంగాణ విషయంలో ఎవరో తనని మిస్ గైడ్ చేశారు వాళ్లతో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడం జరిగింది. ఇది కూడా ఎందుకు చెప్పానంటే.. కొంతకాలం క్రితం పవన్ కళ్యాణ్ కేసీఆర్ గారిని కలిసిన సందర్బంగా తనే స్వయంగా వాళ్ల సామరస్య పాలన గురించి మీడియాతో చెప్పడం జరిగింది. అందుకే ఇపుడు తను ఇస్తున్న ప్రకటనల మీద నాకు అనుమానం వచ్చింది.

    పవన్ కళ్యాణ్ తన లక్ష్యాన్ని చేరుకోవాలని మనస్ఫూర్తిగా

    పవన్ కళ్యాణ్ తన లక్ష్యాన్ని చేరుకోవాలని మనస్ఫూర్తిగా

    చివరగా నేను చెప్పేది ఏమిటంటే.. మన రాజకీయ ఆలోచనలు, మన కులాలు, మతాలు, ప్రాంతాలు, ఆర్థిక స్థోమతలు, ఇవేవీ స్నేహానికి అడ్డుగోడలు కాకూడదు. పవన్ జర్నీ విజయవంతంగా సాగాలని, తాను అనుకున్నది సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను... అని కోన వెంకట్ స్పష్టం చేశారు.

    English summary
    Kona Venkat Clarification on YSRCP, Jana Sena and PawanKalyan. Kona Venkat is an Indian film screenwriter, producer, director, dialogue writer, lyricist and actor known for his works in Telugu cinema, and Bollywood.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X