పవన్‌కల్యాణ్ తో చిత్రం గురించి కోన వెంకట్

By Srikanya

హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ హీరోగా కోన వెంకట్ దర్శకత్వంలో చిత్రం అంటూ చాలా కాలంగా వినపడుతున్నదే. అయితే ఈ విషయమై పవన్ వైపు నుంచి కానీ,కోన వైపు నుంచి కానీ అధికారికంగా స్టేట్ మెంట్స్ రాలేదు. ఈ నేపధ్యంలో ...కోన వెంకట్ ని మీడియా వారు..ప్రశ్నిస్తే..ఆయన సమాధానంతో ఈ ప్రాజెక్టుకి క్లారిటీ ఇచ్చారు.

కోన వెంకట్ మాట్లాడుతూ... పవన్‌కల్యాణ్.. ఆయనతో సినిమా తీయాలనేది నా ఆశ, నా ఆశయం. మనసులో మాలిన్యం అనేది లేని మంచిమనిషి ఆయన. పర్సనల్‌లైఫ్‌ని, ప్రొఫెనల్ లైఫ్‌ని అస్సలు మిక్స్ చేసి చూడరాయన. ఆయనలో ఉన్న గొప్ప క్వాలిటీ అది. ఒక వ్యక్తి దగ్గర టాలెంట్ ఉందంటే వాడు చుట్టం అయి ఉండక్కర్లేదు, ఫ్రెండవనక్కర్లేదు. చివరకు రోడ్డు మీద పోయేవాడైనా సరే.. పిలిచి మరీ అవకాశం ఇస్తాడు. చాలామందికి అవకాశం ఇచ్చాడు కూడా అన్నారు.

అలాగే... ప్రస్తుతం వాళ్లందరూ స్కోడా కార్లేసుకొని మన కంటి ముందే తిరుగుతున్నారు. దటీజ్ పవర్‌స్టార్. నేనోసారి 'కల్యాణ్ మీరు చాలామందికి అవకాశం ఇచ్చారు కదా.. నేను ఓ మంచి కథ తెచ్చుకుంటే నాకూ అవకాశం ఇస్తారా' అని అడిగా. 'ఎందుకివ్వను. ఇవ్వకపోవడానికి నాకేమైనా పిచ్చా. మంచి కథ తీసుకురా చేద్దాం' అన్నారు.

తన దగ్గర నాకెంతో చనువు ఉంది. అభిమానం ఉంది. మంచి కథ తెస్తే తప్పకుండా అవకాశం ఇస్తాడని నా నమ్మకం. మొన్ననే నా శిష్యుడు హరీష్‌శంకర్ ఆయనతో 'గబ్బర్‌సింగ్' లాంటి హిట్ తీశాడు. మరి నేను తీస్తే అంతకు మించిన హిట్టే తీయాలికదా. అలాంటి కథ కోసం ఆలోచిస్తున్నా అని తేల్చి చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X