దర్శకుడిగా కోన వెంకట్ తొలి చిత్రం పూర్తి!

By Bojja Kumar

Kona Venkat directed his first feature film
హైదరాబాద్: ప్రముఖ తెలుగు సినిమా రచయిత కోన వెంకట్ తనదైన టాలెంటుతో ముందుకు సాగుతూ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. దర్శకుడు శ్రీను వైట్లతో పాటు పలువురు దర్శకులు తెరకెక్కించిన హిట్ చిత్రాల వెనక కోన వెంకట్ రచనా నైపుణ్యం ఉంది. ఇటీవల వచ్చిన మంచు ఫ్యామిలీ మల్టీస్టారర్ 'పాండవులు పాండవులు తుమ్మెద' చిత్రానికి కూడా కోన వెంకట్ స్క్రిప్టు అందించారు.

దర్శకత్వంలోకి దిగుతున్నానంటూ కోన వెంకట్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. తొలిసారిగా ఆయన ఓ ఫీచర్ ఫిల్మ్‌కు దర్శకత్వం వహించారు. 'రామ్ - జూలియట్' పేరుతో సాగే ఈచిత్రం న్యూయార్కు పరిసర ప్రాంతాల్లో షూటింగ్ పూర్తి చేసుకుంది. లాఫింగ్ బుద్ధ ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై వంశీ మాదిరాజు, రామ్ గోలీ ఈ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 14న ఈచిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారు.

ఈ సంగతి పక్కన పెడితే వీలైనంత త్వరలో పవన్ కళ్యాణ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు కోన వెంకట్. ఈ విషయాన్ని ఆయన ఇటీవల స్వయంగా వెల్లడించారు. మంచి స్టోరీతో వస్తే తప్పకుండా దర్శకత్వం చాన్స్ ఇస్తానని పవన్ కళ్యాణ్ చెప్పినట్లు కోన వెంకట్ తెలిపారు.

పవన్ కళ్యాణ్ ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, బాడీ లాంగ్వేజ్‌కి తగిన విధంగా ఓ స్టోరీని ప్లాన్ చేసుకుంటున్న కోన వెంకట్.....ఇప్పటి వరకు తెలుగు సినిమా పరిశ్రమలో లేని విధంగా డిఫరెంటుగా, అందరికీ నచ్చే విధంగా, ఫుల్లీ లోడెడ్ ఎంటర్టెన్మెంట్, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X