ఫాల్‌తూ మాటలు చెప్పను, జూ ఎన్టీఆర్ వ్యాఖ్యలు గుర్తు చేస్తూ కోన వెంకట్ ఎమోషనల్!

By Bojja Kumar

ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్‌ హీరో హీరోయిన్స్‌గా నటించిన చిత్రం 'నీవెవరో . కోన ఫిలిమ్‌ కార్పొరేషన్‌, ఎం.వి.వి.సినిమా పతాకాలపై హరినాథ్‌ దర్శకత్వంలో కోన వెంకట్‌, ఎం.వి.వి.సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవల హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన థాంక్యూ మీట్లో కోన వెంకట్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆడియన్స్ కు థాంక్స్ చెప్పడం కోసమే ఈ మీటింగ్ ఏర్పాటు చేశాం. ఏ సినిమా అయినా నమ్మకంతో మొదలై, నమ్మకంతో ఫినిష్ అవుతుంది. ఒక కథను, ఒక వ్యక్తిని నమ్మి సినిమా మొదలవుతుంది. ఆడియన్స్ మేము చూపించే పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్ నమ్మి వాళ్లు థియేటర్‌కు వెళ్లి చూస్తే రిజల్ట్ పూర్తవుతుంది. ఇక్కడ నమ్మకం అనేది ఎంతో ముఖ్యం... అన్నారు.

మీరు మా టార్గెట్ కాదు

మీరు మా టార్గెట్ కాదు

నా వరకు నమ్మకం అనేది దేవుడితో సమానం. అంతగా నమ్మి ఈ సినిమా చేశాం. సినిమా అనే పక్రియలో తీసేవాళ్లు, చేసే వాళ్లు, చూసే వాళ్లు... ఈ ముగ్గురి మీదే సినిమా భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. వీరితో పాటు రాసేవాళ్లు కూడా ఉన్నారు. వీళ్లలో కొంత మంది సినిమా బావుందన్నారు, కొంత మంది అటు ఇటుగా అన్నారు. వాస్తవానికి రాసేవాళ్లను మేము టార్గెట్‌లో పెట్టుకోలేదు. నెక్ట్స్ టైమ్ తప్పకుండా పెట్టుకుంటామన్నారు.

Recommended Video

Neevevaro Movie Review & Rating...! నీవెవరో మూవీ రివ్యూ & రేటింగ్
ఫేక్, ఫాల్‌తూ మాటలు చెప్పను

ఫేక్, ఫాల్‌తూ మాటలు చెప్పను

ఇది ఇంత పెద్ద ఘన విజయం సాధించింది లాంటి ఫేక్, ఫాల్‌తూ మాటలు చెప్పను. ఏ సినిమాకు అయినా జాబ్ సాటిస్పాక్షన్ జేబు సాటిస్పాక్షన్ రెండు ఉండాలి అని చెబుతుంటారు. నాకు 100 శాతం జాబ్ సాటిస్పాక్షన్ ఇచ్చిన సినిమా ఇది. దీని కోసమే మేము పని చేశాం. ఆ టార్గెట్ రీచ్ అయ్యాం. సినిమా ఎంత వసూలు చేస్తుందనేది తర్వాత... అదంతా కేవలం జేబు సాటిస్పాక్షన్. అది ఇంకా రాలేదు.

 దాన్ని ఎవరూ ఆపలేరు

దాన్ని ఎవరూ ఆపలేరు

వర్డ్ ఆఫ్ మౌత్ అనేది ఎంతో ముఖ్యం. మా టార్గెట్ ఆడియన్సే... వారిని ఎంటర్టెన్ చేయడమే. వారికి రీచ్ అయింది... అవుతూ ఉంది. వారి ద్వారా వేల లక్షల కోట్ల మందికి రీచ్ అవుతుంది. దాన్ని ఎవరూ ఆపలేరు.

 ఎన్టీఆర్ చెప్పిందే చెబుతున్నాను

ఎన్టీఆర్ చెప్పిందే చెబుతున్నాను

నమ్మకమే ఏ సినిమాకైనా సోల్. మా నమ్మకాన్ని కొంతమంది నమ్మక పోవచ్చు. మీరు నమ్మేంత వరకు చేస్తూనే ఉంటాం. ఎన్టీఆర్ టెంపర్ ఆడియో ఫంక్షన్లో ‘మీకు సినిమాలు నచ్చేంత వరకు చేస్తూనే ఉంటానని...' మాట చెప్పారు. ఆ మాట నేను ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటూ ఉంటాను. అదే మా ప్రయత్నం. ఏదో కోట్లు సంపాదించేద్దామని కాదు. మీరిచ్చే సక్సెస్ అనేది బలం, ధైర్యం. దాని ద్వారా ఇంకా పది సినిమాలు వస్తాయి, పది మంది టెక్నీషియన్లు వస్తారు.

 అందుకే ఇటు వైపు

అందుకే ఇటు వైపు

ఎంవీవీ బిల్డర్స్ టర్నోవర్ సంవత్సరానికి 100 కోట్లు ఉంటుంది. ఈ తలనొప్పులన్నీ మనకెందుకండీ పెద్ద డైరెక్టర్, పెద్ద హీరోతో సినిమా చేద్దామని ఎంవీవీ అన్నారు. ఒక కొత్త సినిమా, కొత్త ప్రయత్నం చేద్దామనే ఉద్దేశ్యంతో ఈ సినిమా చేశాం. వెంకీ నుండి బాద్ షా వరకు చాలా కమర్షియల్ సినిమాలకు రాశాను. అపుడు కూడా తిట్టారు. ఎప్పుడు చూసినా ఈ బకరా కామెడీలేనా? అన్నారు. అందుకే కొత్త ప్రయత్నం చేద్దామని 2014లో గీతాంజలితో కొత్త ప్రయత్నం మొదలు పెట్టి ‘నీవెవరో' వరకు వచ్చాం... అని కోన వెంకట్ అన్నారు.

అలా చేయడం సరికాదు

అలా చేయడం సరికాదు

ఎంక‌రేజ్ మెంట్ అంద‌రికీ చాలా ముఖ్యం. ఈ సినిమా కోసం ఎవ‌రు ఎంత క‌ష్ట‌ప‌డ్డారో నాకు తెలుసు. కొన్ని వంద‌లు మంది .. వేల గంట‌లు ప‌నిచేస్తే.. ఓ సినిమా వ‌స్తుంది. అలాంటి సినిమాను ఓ ప‌ది రూపాయ‌ల పెన్‌తో కొట్టి ప‌డేయ‌డం స‌రికాదు.. ఇది నా ఆక్రోశం కాదు.. ఆవేద‌న‌. ఆడియెన్స్ కోస‌మే మేం సినిమాలు చేస్తాం. రాసేవాళ్లు అది అర్థం చేసుకుంటే చాలని కోన వెంకట్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X