twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినిమాలు అనేవి థియేటర్ల కోసమే.. అదే మా ప్రాధాన్యత కూడా.. ‘నిశ్శబ్దం’ రూమర్స్‌పై కోన వెంకట్ ఫైర్

    |

    అనుష్క శెట్టికి ఎన్ని కష్టాలు వచ్చి పడ్డాయో. బాహుబలి తరువాత పాన్ ఇండియా క్రేజ్ వచ్చింది. కానీ సరైన ప్లానింగ్ లేకపోవడంతో అదంతా బూడిదలో పోసిన పన్నీరైంది. బాహుబలి తరువాత చకచకా ప్రాజెక్ట్‌లను ఓకే చెప్పలేదు. భాగమతి చిత్రంతో హిట్ కొట్టిన స్వీటీకి.. ఆమె రేంజ్‌కు ఏమాత్రం సరితూగలేదు. నిశ్శబ్దం అంటూ హాలీవుడ్ టెక్నీషియన్స్‌తో తెరకెక్కించి అందరి దృష్టిని ఆకర్షించారు. షూటింగ్ మొత్తాన్ని అమెరికాలోనే చేసిన చిత్రంగా నిశ్శబ్దం రికార్డులకెక్కింది.

     అత్యంత భారీ ఎత్తున..

    అత్యంత భారీ ఎత్తున..

    నిశ్శబ్దం చిత్రాన్ని ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు వంటి భాషల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అయితే ఈ చిత్రానికి ఎప్పటికప్పుడు ఏదో రకమైన అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. నిజానికి ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సింది. పలుమార్లు వాయిదా పడుతూ చివరగా ఏప్రిల్‌లో వచ్చేందుకు సిద్దమైంది.

    కరోనాతో అంతా తారుమారు..

    కరోనాతో అంతా తారుమారు..

    కరోనా వైరస్ విజృంభణ, కట్టడికి లాక్ డౌన్ విధించడంతో అంతా తారుమారైంది. సినీ పరిశ్రమ, థియేటర్స్ మొత్తంగా మూతపడ్డాయి. దీంతో నిశ్శబ్దంతో పాటు ఎన్నో చిత్రాలకు ఎదురుదెబ్బలు తగిలాయి. అయితే కొందరు మాత్రం తమకు ఏర్పడిన నష్టాన్ని ఎంతో కొంత పూడ్చుకోవడానికి ఓటీటీ వైపు అడుగులు వేస్తున్నారు.

     నిశ్శబ్దం కూడా..

    నిశ్శబ్దం కూడా..

    ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓటీటీనే సరైన మార్గమని కొంత మంది నిర్మాతలు ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలోనే అనుష్క శెట్టి నిశ్శబ్దం కూడా అమెజాన్ ప్రైమ్‌లొనే నేరుగా విడుదల కానుందనే వార్తలు గుప్పుమన్నాయి. గత రెండ్రోజుల నుంచి వీటికి సంబంధించిన వార్తలే హల్చల్ చేస్తున్నాయి. నిశ్శబ్దం అన్ని భాషలకు సంబంధించిన హక్కుల బిజినెస్ రూ.26 కోట్ల మేర జరిగిందని కూడా టాక్ బయటకు వచ్చింది.

    ఫైర్ అయిన కోన

    ఫైర్ అయిన కోన

    కోన వెంకట్ తాజాగా చేసిన ట్వీట్ ఎన్నో అనుమానాలకు దారి తీస్తోంది. ఆ ట్వీట్‌ను నిశితంగా పరిశీలిస్తే.. నిశ్శబ్దం చిత్రం ఓటీటీ వస్తుందనే వార్తలను ఖండించినట్టుగానే ఉంది. ఇంతకీ కోన వెంకట్ ట్వీట్‌లో ఏముందో ఓ సారి చూద్దాం.

    Recommended Video

    Kona Venkat Clarifies Comments On Pawan Kalyan | Filmibeat Telugu
    సినిమాలు అనేవి సినిమా హాల్ కోసమే..

    సినిమాలు అనేవి సినిమా హాల్ కోసమే..

    ‘ఎన్నో కష్టాలను, బాధలను ఓర్చుకుని ఎంతో ప్యాషన్‌తో మేము ఈ సినీ ఇండస్ట్రీకి వచ్చాము.. థియేటర్స్‌లో ప్రేక్షకుల రియాక్షనే మాకు స్ఫూర్తి, ఆక్సీజన్.. వాటితో ఏది సరితూగదు.. సినిమా అంటే కేవలం సినిమా హాల్స్‌లోనే చూడాలి అంతే.. అదే మా ప్రాధాన్యత కూడా' అని కాస్త గట్టిగానే స్పందించాడు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

    English summary
    Kona Venkat Fires On Rumors That Nishabdham to release on Amazon Prime. We all came to Film industry with lot of passion and after many struggles.. Audience reactions to our work in THEATRES is our motivation and oxygen ... Nothing can match this feeling.. CINEMA is meant for Cinema Halls.. And that’s our “PRIORITY”.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X