ప్రభుదేవా, తమన్నా కాంబినేషన్లో హారర్ మూవీ
హైదరాబాద్: ఇప్పటి వరకు తమన్నా అంటే పాల పొంగు లాంటి అందం మాత్రమే. మనం ఆమెను హారర్ సినిమాల్లో చూడలేదు. త్వరలో ఈ మిల్కీ బ్యూటీ హారర్ సినిమాతో భయపెట్టబోతోంది. తెలుగు, తమిళంలో తెరకెక్కబోయే ఈ చిత్రంలో తమన్నాతో పాటు ప్రభుదేవా, సప్తగిరి, సోనూ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో రచయిత కోన వెంకట్ కూడా జాయిన్ అయినట్లు తెలుస్తోంది. తమిళ దర్శకుడు ఎఎల్ విజయ్ దర్శకత్వం వహించబోతున్నారు. ఈ చిత్రానికి కథ కూడా ఆయనే తయారు చేసారు. బ్లూ సర్కిల్ కార్పొరేషన్ బేనర్లో శివ తూర్లపాటి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళంలో పాటు హిందీలో కూడా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎంవివి సినిమాస్ వారు సహ నిర్మాతగా వ్యవహరించబోతున్నారు.

హారర్ కామెడీ కాన్సెప్టుతో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. తెలుగు వెర్షన్ కు రచయితగా కోన వెంకట్ పని చేస్తారని తెలుస్తోంది. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











