విబేధాలు: శ్రీను వైట్ల కామెంట్‌పై కోన వెంకట్ స్పందన!
హైదరాబాద్: బాద్ షా చిత్రానికి తను పడ్డ కష్టానికి శ్రీను వైట్ల క్రెడిట్ ఇవ్వలేదని, రచయితగా తన పేరు వేయలేదే కోపంతో 10 సంవత్సరాలతో పాటు శ్రీను వైట్లతో పని చేసిన రచయిత కోన వెంకట్ అతని నుండి విడిపోయిన సంగతి తెలిసిందే. ఆగడు చిత్రానికి కోన వెంకట్ పని చేయక పోవడంతో అతను లేని లోటు సినిమాలో కనిపించిందనే విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఇంటర్య్వూలో శ్రీను వైట్ల స్పందించారు.
"కోన వెంకట్ కావొచ్చు... మరొకరు కావొచ్చు..నేను రైటర్స్ గురించి ఎక్కువగా పట్టించుకోను. స్వతహాగా నేను రచయితను. దూకుడు చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ నాదే. ఎవరో రాసిన డైలాగ్స్‌కు నా పేరు వేసుకుంటానంటే రాసినవాళ్లు ఊరుకోరు కదా. మాటల రచయితగా కొత్తగా నేను నిరూపించుకోవాల్సింది ఏమీ లేదనుకుంటున్నాను" అన్నారు.

శ్రీను వైట్ల కామెంట్స్‌పై తాజాగా మళ్లీ కోన వెంకట్ కూడా స్పందించారు. ఓ టీవీ ఇంటర్వ్యూలో కోన వెంకట్ మాట్లాడుతూ....శ్రీను వైట్లతో నా ట్రావెల్ పది సంవత్సరాలు. మేమిద్దరం కలిసి బ్లాక్ బస్టర్ చిత్రాలు అందించాం. అయితే క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఫ్రెండ్లీగా విడిపోయాం. నాకు శ్రీను వైట్ల లైఫ్ ఇవ్వలేదు. నేను శ్రీనుకి లైఫ్ ఇవ్వలేదు. మా మధ్య ఇప్పటికీ మంచి సంబంధాలే ఉన్నాయి అని కోన వెంకట్ చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











