రెమ్యూనరేషన్: కోన వెంకట్ నిర్మొహమాటంగా...

సాధారణంగా సినిమా ఇండస్టీలోని వ్యక్తులు తమ రెమ్యూనరేషన్ వివరాలు బయటకు చెప్పడానికి పెద్దగా ఇష్ట పడరు. అయితే కోన వెంకట్ మాత్రం ఇందుకు మినహాయింపు అని చెప్పొచ్చు. ఇటీవల ఓ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో కోన వెంకట్ మాట్లాడుతూ.....తన రెమ్యూనరేషన్ వివరాలు నిర్మొహమాటంగా బయట పెట్టారు.
ఒక్కో సినిమాకు తాను రూ. కోటి రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు కోన వెంకట్ తెలిపారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన ఇంకా తన జీవితానికి సంబంధించిన చాలా విషయాలు వెల్లడించారు. ఆ మధ్య దర్శకుడు శ్రీను వైట్లకు, తనకు మధ్య ఏర్పడ్డ వివాదం గురించి కూడా తెలిపారు.
శ్రీను వైట్ల సినిమాల్లో కోన వెంకట్ పాత్ర ప్రముఖంగా ఉండేది. అయితే ఆ మధ్య ఓ సినిమా విషయంలో ఇద్దరి మధ్య విబేధాలు వచ్చాయి. తనకు క్రెడిట్ ఇవ్వడం లేదంటూ.....పోస్టర్లపై తన పేరు వేయడం లేదని కోన వెంకట్ బహిరంగ వ్యాఖ్యలు చేసారు. అప్పటి నుండి ఇద్దరూ కలిసి పని చేయడం లేదనే విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











