పవన్ కళ్యాణ్ ఓ గోల్ సెట్ చేసుకున్నారు.. కోనవెంకట్!

ప్రముఖ రచయిత కోన వెంకట్ నుంచి వస్తున్న మరో విభిన్న చిత్రం నీవెవరో. ఆది పినిశెట్టి ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. రితిక సింగ్, తాప్సి హీరోయిన్స్. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ కు అద్భుతమైన స్పందన వస్తోంది. చూస్తుంటే ఈ చిత్రం రివేంజ్ నేపథ్యంలో సాగే ఎమోషనల్ లవ్ డ్రామాగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రానికి కోనవెంకట్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. హరినాథ్ ఈ చిత్రానికి దర్శకుడు. కోన వెంకట్ ఇప్పటికే పలు విజయవంతమైన చిత్రాలకు డైలాగ్స్ అందించారు. టీజర్ విడుదల సందర్భంగా కోన వెంకట్ మీడియా అడిగిన ఆసక్తికరమైన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

Kona Venkat responds on movie with Pawan Kalyan

పవన్ కళ్యాణ్ తో సినిమా ఉంటుందా అనే ప్రశ్నకు కోన వెంకట్ బదులిస్తూ.. పవన్ కళ్యాణ్ ఓ గోల్ సెట్ చేసుకున్నారు. సినిమాలు చేస్తారని కనుచూపు మేరలో కూడా అనిపించడం లేదు. ఆయన గోల్ చేరుకున్నాక అప్పుడు ఆలోచిస్తా అని అన్నారు. చాలా రోజుల క్రితం తన డైరెక్షన్ లో నటించడానికి పవన్ కళ్యాణ్ అంగీకరించారని కోన వెంకట్ తెలిపారు. పవన్ కళ్యాణ్ తాను ముందుకు అంగీకరించిన చిత్రాలు చేయడం, ఈలోపు రాజకీయాల్లో బిజికవడంతో వీరి కాంబినేషన్లో సినిమా సాధ్యపడలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X