కత్తికి థ్యాంక్స్.. కానీ అప్పుడే అయిపోలేదు: కోన వెంకట్ ట్విస్ట్..
Recommended Video

పవన్ ఫ్యాన్స్‌కు, మహేష్ కత్తికి ఇదో బిగ్ రిలీఫ్. నాలుగు నెలల పాటు డిబేట్ల మీద డిబేట్లతో సుదీర్ఘంగా కొనసాగిన వివాదానికి ఎట్టకేలకు మహా న్యూస్ టీవి చానెల్ డిబేట్ ద్వారా ఫుల్ స్టాప్ పడింది. ఇరువర్గాల మధ్య సయోధ్య కుదరడంతో సంతోషంగా సెల్ఫీలు దిగి మరీ వివాదానికి శుభం కార్డ్ వేశారు.
అయితే ఈ సయోధ్య ఎంతకాలమనేది ఇప్పుడే చెప్పలేం కానీ.. ఏదైతేనేం మంచే జరిగిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రచయిత కోన వెంకట్ కూడా మహేష్ కత్తికి థ్యాంక్స్ చెప్పడం విశేషం.
కోన స్పందన:
ఈ వివాదానికి ఒక పరిష్కారాన్ని చూపించిన మహా టీవి మూర్తి గారికి నా ధన్యవాదాలు. పవన్ కల్యాణ్ అభిమానులకు ఇదో బిగ్ రిలీఫ్. ఈ రాద్దాంతానికి సద్దమణిగించడానికి రంగంలోకి దిగిన పవన్ కల్యాణ్ శ్రేయోభిలాషులు విష్ణు, రాంకీ, కల్యాణ్ దిలీప్ సుంకర, నాగిరెడ్డి, కోటిలకు బిగ్ థ్యాంక్స్.
కత్తికి థ్యాంక్స్:
సమస్య శాశ్వత పరిష్కారానికి ముందుకొచ్చిన కత్తి మహేష్‌కు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నీ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నాను. ఇకపై ఫాల్స్ కామెంట్స్‌తో, వీడియోలతో ఎవరూ కత్తి జోలికి వెళ్లవద్దు. ఒకవేళ అలా ఎవరైనా చేస్తే.. వాళ్లంతా పవన్ కల్యాణ్‌కు శత్రువుల కిందే లెక్క. నన్ను నమ్ము.
అప్పుడే అయిపోలేదు: కోన ట్విస్ట్
పోరాటం అప్పుడే అయిపోలేదు మిత్రులారా. తన లక్ష్యాన్ని చేరుకోవడానికి పవన్ కల్యాణ్ చాలా కష్టాల్ని ఎదుర్కొంటున్నారు. మీరు నిజంగా పవన్ శ్రేయోభిలాషి అయితే, ఇకనైనా శాంతంగా, సంయమనంగా ఉండండి. మీరు పవన్ కల్యాణ్ భావజాలనికి ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి మీరు ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా సమాజ విశ్వాసాన్ని చూరగొనండి.

అంతర్మథనం..:
పవన్ ఫ్యాన్స్ మహేష్ కత్తి వివాదంలో వ్యక్తిగత విషయాలు కూడా తెర పైకి రావడంతో ఇరు వర్గాలు అంతర్మథనంలో పడ్డాయనిపిస్తోంది. మహేష్ కత్తి వ్యక్తిగత విషయాలను బయటకు లాగడంతో.. తాను కూడా పవన్ విషయాలను బయటపెడుతానంటూ కత్తి కామెంట్స్ చేశారు.
ఇలాగే సాగితే వ్యవహారం మరింత ముదురుతుంది కాబట్టి.. ఇరు వర్గాలు సంయమనం పాటించడమే మంచిదని నిర్ణయించుకున్నట్లున్నారు.

పార్టీ చేసుకున్నారా?:
ఫిలిం నగర్ లోని ఓ రెస్టారెంట్ వేదికగా పవన్ ఫ్యాన్స్, కత్తికి మధ్య సయోధ్య కుదిరినట్లు తెలుస్తోంది. పెద్ద మనసుతో కత్తి కేసును ఉపసంహరించుకోవడం పట్ల ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేశారు. అంతేకాదు, వివాదం సద్దుమణిగిన సందర్భంగా ఇరు వర్గాలు పార్టీ కూడా చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











