»   » కోన వెంకట్ ‘రామ్ - జూలియట్' ఫస్ట్ లుక్(ఫోటోలు)

కోన వెంకట్ ‘రామ్ - జూలియట్' ఫస్ట్ లుక్(ఫోటోలు)

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ : దర్శకత్వంలోకి దిగి తొలిసారిగా ఆయన ఓ ఫీచర్ ఫిల్మ్‌కు దర్శకత్వం వహించారు. 'రామ్ - జూలియట్' పేరుతో సాగే ఈచిత్రం న్యూయార్కు పరిసర ప్రాంతాల్లో షూటింగ్ పూర్తి చేసుకుంది. లాఫింగ్ బుద్ధ ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై వంశీ మాదిరాజు, రామ్ గోలీ ఈ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ లోగా చిత్రం పోస్టర్ లోగో,ఫోటోలను సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ ద్వారా విడుదల చేసారు కోన వెంకట్.


  ఇక రచయితలు దర్శకులుగా మారడం ఇటీవల మనం ఎక్కువగా చూస్తున్నాం. ఇప్పుడు ఈ జాబితాలోకి రచయిత కోన వెంకట్‌ వచ్చి చేరారు. 'రామ్‌ అండ్‌ జూలియట్‌' పేరుతో ఓ సినిమాకి దర్శకత్వం వహించారాయన.

  న్యూయార్క్‌ నేపథ్యంలో నూతన నటీనటులతో సాగే ప్రేమకథ ఇది. వరశీ మదిరాజు, రామ్‌ గోలి నిర్మాతలు. ఈ నెల 14న సినిమా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేస్తున్నారు. అయితే ఈ సినిమాను థియేటర్లలో కాకుండా కేవలం అంతర్జాలంలోనూ, టీవీల్లోనే విడుదల చేస్తున్నారు.

  చిత్రానికి సంభందించిన ఫోటోలు... స్లైడ్ షో లో

  రైటర్ గా హైలీ సక్సెస్ ..

  రైటర్ గా హైలీ సక్సెస్ ..

  కోన వెంకట్ తనదైన టాలెంటుతో ముందుకు సాగుతూ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. దర్శకుడు శ్రీను వైట్లతో పాటు పలువురు దర్శకులు తెరకెక్కించిన హిట్ చిత్రాల వెనక కోన వెంకట్ రచనా నైపుణ్యం ఉంది.

  రీసెంట్ గా ...

  రీసెంట్ గా ...


  ఇటీవల వచ్చిన మంచు ఫ్యామిలీ మల్టీస్టారర్ ‘పాండవులు పాండవులు తుమ్మెద' చిత్రానికి కూడా కోన వెంకట్ స్క్రిప్టు అందించారు. ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. మంచు ఫ్యామిలీకి చాలా కాలం తర్వాత దక్కిన విజయం గా చెప్తున్నారు.

  బాలీవుడ్ లో సైతం...

  బాలీవుడ్ లో సైతం...

  కోన వెంకట్‌ ఇప్పుడు బాలీవుడ్‌ రచయిత కాబోతున్నారు. అభిషేక్‌ బచ్చన్‌ హీరోగా రూపొందనున్న సినిమాకి ఆయన కథ రాస్తున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌లో వెల్లడించారు కోన. ''అభిషేక్‌ సినిమా కోసం పని చేయబోతున్నాను. ఒప్పందం జరిగింది. భారతీయ సినీరంగంలో ఇప్పటివరకూ రాని కథని సిద్ధం చేయబోతున్నా'' అని పేర్కొన్నారు కోన.

  రవితేజ చిత్రానికి...

  రవితేజ చిత్రానికి...

  మరో ప్రక్క కోనవెంకటే ప్రసుతం మరికొన్ని సినిమాలకు రైటర్ గా పనిచేస్తూ బిజీగా ఉన్నాడు. రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ‘పవర్' సినిమా స్క్రిప్ట్ కోసం ఎస్. రవీంద్రతో కలిసి పనిచేసాడు. అలాగే తను పనిచేసిన ‘పాండవులు పాండవులు తుమ్మెద' సినిమా ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.

  పవన్ తో...

  పవన్ తో...

  వీలైనంత త్వరలో పవన్ కళ్యాణ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు కోన వెంకట్. ఈ విషయాన్ని ఆయన ఇటీవల స్వయంగా వెల్లడించారు. మంచి స్టోరీతో వస్తే తప్పకుండా దర్శకత్వం చాన్స్ ఇస్తానని పవన్ కళ్యాణ్ చెప్పినట్లు కోన వెంకట్ తెలిపారు.

  స్టోరీ రెడీ

  స్టోరీ రెడీ

  పవన్ కళ్యాణ్ ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, బాడీ లాంగ్వేజ్‌కి తగిన విధంగా ఓ స్టోరీని ప్లాన్ చేసుకుంటున్న కోన వెంకట్.....ఇప్పటి వరకు తెలుగు సినిమా పరిశ్రమలో లేని విధంగా డిఫరెంటుగా, అందరికీ నచ్చే విధంగా, ఫుల్లీ లోడెడ్ ఎంటర్టెన్మెంట్, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.

  శ్రీదేవితోనూ...

  శ్రీదేవితోనూ...

  కోన వెంకట్ త్వరలో శ్రీదేవితో సినిమా చేయబోతున్నారు. శ్రీదేవి కోసం కోన ఒక అద్భుతమైన కథను రెడీ చేసాడట. ఈ విషయాన్ని కోన వెంకట్ స్వయంగా తన సోషల్ నెట్వర్కింగ్ సైట్ ద్వారా వెల్లడించడం గమనార్హం. ఆయన చెప్పిన వివరాల ప్రకారం....మూడు బాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారట. తెలుగు, తమిళం, హిందీలో తెరకెక్కే ఈచిత్రాన్ని శ్రీదేవి భర్త బోనీ కపూర్ నిర్మించబోతున్నారని ఆయన తెలిపారు.

  సమంత చేతుల మీదుగా...

  సమంత చేతుల మీదుగా...

  ‘రామ్ అండ్ జూలియట్' వేసవి లో విడుదల కు సిద్ధం కాగా ఈ చిత్రాన్ని ప్రమోట్ చెయ్యడం మొదలుపెట్టారు . తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం మొదటి లుక్ ని సమంత ఫిబ్రవరి 14 న విడుదల చెయ్యనుంది. ఈ రొమాంటిక్ డ్రామా ఫస్ట్ లుక్ ని విడుదల చెయ్యడానికి సమంతను మించిన సెలిబ్రిటీ లేరు. అని కోన వెంకట్ తన ట్విట్టర్ పేజి లో పేర్కొన్నారు.

  English summary
  
 Script writer Kona Venkat is very families with directors Srinu Vaitla and Gopi Mohan and also worked for many super hit films and now, he turned to director and filmed a Debut Movie named “Romeo Juliet”. The First Look was going to be Unveiled on February 14th as Valentin's day special and it is Direct to Online release.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more