కోన వెంకట్ ‘శంకరాభరణం’
హైదరాబాద్: రచయిత కోన వెంకట్ సమర్పణలో ఇటీవల వచ్చిన ‘గీతాంజలి' చిత్రం కామెడీ హారర్ చిత్రం వచ్చి మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. గతంలో ‘గీతాంజలి' పేరుతో నాగార్జున హీరోగా ఓ సినిమా వచ్చినప్పటికీ...ఆ సినిమాకు ఎలాంటి సంబంధం లేకుండా అదే టైటిల్‌తో తెరకెక్కించి సక్సెస్ అయ్యారు. రాజ్ కిరణ్ ఈచిత్రానికి దర్శకత్వం వహించగా, ఎంవివి సత్యనారాయణ నిర్మించారు.
తాజాగా కోనవెంకట్ ఇప్పుడు మరో క్లాసిక్ సినిమా పేరుతో మరో కామెడి మూవీ రూపొందించే పనిలో ఉన్ననట్లు సమాచారం. జె.వి.సోమయాజులు ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘శంకరాభరణం' చిత్రం అప్పట్లో పెద్ద విజయం సాధించింది. ‘శంకరాభరణం' టైటిల్ తో ఇపుడు కామెడీ సినిమా ప్లాన్ చేస్తున్నారు కోన వెంకట్.

గతంలో వచ్చిన ‘శంకరాభరణం' చిత్రానికి ఏమాత్రం సంబంధం లేకుండా డిఫరెంటు కాన్సెప్టుతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఎంవివి బ్యానర్ పై ఎంవివి సత్యనారాయణ నిర్మాతగా ఈ చిత్రం రాబోతోంది. సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలో తెలియనున్నాయి.
త్వరలో దర్శకుడిగా...
కోన వెంకట్ త్వరలో దర్శకుడి మారబోతున్నాడు. ఇటీవల రవితేజకు స్టోరీ లైన్ వినిపించిన కోన వెంకట్ అతని నుండి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నారని తెలుస్తోంది. 2015లో ఈచిత్రం మొదలయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











