పవన్ కోసం మొదలెట్టిన కోన వెంకట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తర్వాతి సినిమా కోసం రచయిత కోన వెంకట్ పని మొదలు పెట్టారు. సినిమా స్టోరీ ఏమిటో చెప్పడానికి నిరాకరించిన కోన...తాను పవన్ చిత్రానికి కథ, స్ర్కీన్ ప్లే అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహించనున్నారు. డివివి దానయ్య నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. దూకుడు, రెడీ చిత్రాల ద్వారా మంచి రైటర్ గా పేరు తెచ్చుకున్న కోన వెంకట్ ఈ సారి పవన్ కళ్యాణ్ కోసం దుమ్మురేపే కథను, డైలాగులను సిద్ధం చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇక పోతే....పవన్ కళ్యాన్ ప్రస్తుతం గబ్బర్ సింగ్ షూటింగులో బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమాకు హారిష్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా శృతి హాసన్ పవన్ సరసన రొమాన్స్ చేయనుంది. సల్మాన్ ఖాన్ హీరోగా హిందీలో వచ్చిన దబాంగ్ చిత్రానికి గబ్బర్ సింగ్ రీమేక్.


Click it and Unblock the Notifications











