పవన్ కళ్యాణ్ పై కోన వెంకట్ ఫన్ అండ్ యాక్షన్ స్టోరీ
దూకుడు లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాలకు స్కిప్టు అందించిన కోన వెంకట్ తాజాగా పవన్ కళ్యాణ్ కోసం స్ర్కిప్టు రాయడం మొదలు పెట్టారు. ఫన్ అండ్ యాక్షన్ గా సాగే ఈ స్క్రిప్టును త్వరలోనే పవన్ కళ్యాణ్ కు వినిపించనున్నాడట. ఈ విషయమై కోన వెంకట్ ట్విట్టర్లో స్పందిస్తూ...''నేను నా యొక్క సోల్ మేట్ పవన్ కళ్యాణ్ కోసం కథ రాయడం మొదలు పెట్టాను. తర్వలోనే ఆయనకు దీన్ని వినిపిస్తా. అయితే దీన్ని పర్ ఫెక్టుగా తెరకెక్కించే దర్శకుడు కావాలి. ఈ కథ మొత్తం ఫన్ అండ్ యాక్షన్ తో కూడుకుని ఉంటుంది'' అని చెప్పుకొచ్చారు. గతంలో కోన వెంకట్ పవన్ కళ్యాణ్ నటించిన 'బాలు ABCDEFG' చిత్రానికి స్కిప్టు అందించారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్' చిత్రంలో నటిస్తున్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తోంది. బండ్ల గణేస్ శ్రీ పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ చివరి వారంలోగానీ, మే ఫస్ట్ వీక్ లో గానీ సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈచిత్రానికి సంబంధించిన టీజర్ ఇటీవల విడుదలైంది. దీని గురించి నిర్మాత మాట్లాడుతూ ఈ టీజర్ లో పవన్ కళ్యాణ్ చెప్పిన 'నాక్కొంచెం తిక్కుంది...కానీ, దానికో లెక్కుంది' డైలాగ్ సూపర్ అంటున్నారు. ఇలాంటి సూపర్ డైలాగ్స్ మా హరీష్ శంకర్ ఈ సినిమా కోసం ఎన్నో రాశారు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పవన్ కళ్యాణ్ చెప్పే ప్రతీ డైలాగ్‌కు జనం చప్పట్లు కొడతారు' అని చెప్పారు.
ఈ చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రంలో చేయనున్నాడు. ఈచిత్రలో పవన్ సరసన కాజల్ ను ఎంపిక చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











