రైటర్లకు గుర్తింపులేదు, శ్రీను వైట్లతో ఇక చేయకపోవచ్చు : కోన వెంకట్

By Bojja Kumar

హైదరాబాద్ : దర్శకులు రచయితలను వాడుకుంటున్నారు, మాకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదు, మా ప్రతిభను ఉపయోగించుకుని వారు పైకొస్తున్నారు, ఇండస్ట్రీలో కథా చౌర్యం ఎక్కువైంది, స్క్రీన్ ప్లే అంటే తెలియని దర్శకులు కూడా నేడు ఇండస్ట్రీలో ఉన్నారు....అంటూ స్టార్ రైటర్ కోన వెంకట్ ఇటీవల ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

దీనికి తోడు ఇటీవల 'బాద్‌షా' సక్సెస్ మీట్‌కు ఆయన హాజరు కాక పోవడం, మరో వైపు దర్శకుడు శ్రీను వైట్ల‌తో కోన వెంకట్‌కు విబేధాలు వచ్చాయి అని పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తుండటంతో....కోన వెంకట్ వాఖ్యలు శ్రీను వైట్లను టార్గెట్ చేసి చేసినవే అనే వాదన ప్రస్తుతం పరిశ్రమలో వినిపిస్తోంది.

ఈ నేపథ్యంలో దర్శకుల సంఘం ఇటీవల మీడియా సమావేశం ఏర్పాటు చేసి కోన వెంకట్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసారు. నీకు ఎవరు అన్యాయం చేసారో వారి పేర్లను బయట పెట్టు, కానీ ఇలా పరిశ్రమలో దర్శకులు అందరీని ఉద్దేశించి కోన మాట్లాడం సరికాదు, ఆయన మీడియా ముఖంగా వచ్చి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసారు.

ఈ పరిణామాల నేపథ్యంలో రచయిత కోన వెంకట్....బుధవారం మధ్యాహ్నం ఎన్టీవీకి ఇచ్చిన లైవ్ ఇంటర్య్యూలో వివరణ ఇచ్చారు. తాను అందరు దర్శకులను ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని, అలాంటి కొందరు దర్శకుడు ఇండస్ట్రీలో ఉన్నారని చెప్పారు. నా పత్రికా ఇంటర్వ్యూ చూసిన చాలా మంది దర్శకులు నాకు ఫోన్ చేసి నన్ను సమర్థించారు అని వెల్లడించారు.

తాను శ్రీను వైట్లను ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేసాననడం లో నిజం లేదని, శ్రీను వైట్లతో తాను వెంకీ సినిమా నుంచి బాద్ షా వరకు పదేళ్లు పని చేసానని, తనకు ఎక్కువ గుర్తింపు శ్రీను వైట్ల సినిమాల వల్లనే వచ్చిందని, అదే విధంగా తన వల్ల కూడా శ్రీను వైట్ల సినిమాలకు మంచి పేరొచ్చిందని కోన వెంకట్ చెప్పుకొచ్చారు. మరి మీరు చెబుతున్న ఆ సోకాల్డ్ దర్శకులు ఎవరు? అనే ప్రశ్నకు మాత్రం కోన వెంకట్ సమాధానం దాట వేసారు. తాను వారి పేర్లు బయట పెట్టబోదలుచుకోలేదని, వాళ్లు ఎవరో ఇండస్ట్ర్రీలో అందరికీ తెలుసన్నారు. శ్రీను వైట్లతో ఇకపై సినిమాలు చేస్తారా? అని అడిగిన ప్రశ్నకు కోన వెంకట్ సమాధానం ఇస్తూ...ఇకపై చేయకపోవచ్చు. ఎందుకంటే నేను ఓక కథ రాసుకుని దర్శకత్వం చేసే ఆలోచనలో ఉన్నాను అని సమాధానం ఇచ్చారు కోన వెంకట్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X