Don't Miss!
- Automobiles కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి వీడియో
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- News పురందేశ్వరికి చెక్ పెడుతోందెవరు - చంద్రబాబు ఎటువైపు..!?
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
హీరో నాని ఫుల్ బాటిల్ కొట్టాడు, తొడలు కొట్టాడు... అంతుందా?
‘నిన్ను కోరి’ సక్సెస్ మీట్ విజయవాడలో జరిగింది. ఈ సందర్భంగా కోన వెంకట్ ఆసక్తికర విషయం తెలిపారు.
నాని, నివేదా థామస్, ఆది ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన 'నిన్ను కోరి' చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిత్ర యూనిట్ వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ సక్సెస్ మీట్స్ నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం సక్సెస్ మీట్ విజయవాడలో జరిగింది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత, స్క్రీన్ ప్లే రైటర్ కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆడియన్స్ కూడా ఒక్కోసారి అర్థం కారు... అన్నీకావాలంటారు, ఏది లేక పోయినా చిన్న ఫీల్ ఉంటే హిట్ చేసేస్తారు అని తమ సినిమా విజయాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
విజయానికి కారణం
కోన వెంకట్ మాట్లాడుతూ.... సినిమా ఎందుకు ఇంత పెద్ద విజయం సాధించింది అని ఆలోచించాను. నాని అద్భుతమైన పెర్ఫార్మెన్సా? అరుణ్ పాత్రలో ఆది డిగ్నిపైడ్గా నటించడమా? పల్లవి పాత్రలో నివేదా అద్భుతమైన పెర్ఫార్మెన్సా? నేను అందించిన స్క్రీన్ ప్లేనా? శివ కథ, దర్శకత్వమా? డివివి సంస్థ నిర్మాణ విలువలా? అని బేరీజు వేస్తే... ఇవేవీ కావు మంచి మనసున్న ప్రేక్షకుల వల్లే సినిమా ఇంత పెద్ద హిట్టయింది. వారి వల్లే మాకు ప్యూర్ సక్సెస్ వచ్చిందని కోన వెంకట్ అన్నారు.
Recommended Video
కర్త, కర్మ, క్రియ నాని
‘నిన్ను కోరి' సినిమా తెరకెక్కడానికి, మీ ముందుకు రావడానికి కర్త, కర్మ, క్రియ నాని. నాని ఈ కథను ఎంతో నమ్మారు, ఆయన నమ్మకాన్ని ప్రేక్షకులు అక్షరాల నిజం చేశారని కోన వెంకట్ వ్యాఖ్యానించారు.
నాని మాకంటే ఎక్కువ తొడలు కొట్టాడు, అంతుందా?
‘నిన్ను కోరి' సినిమాకు మా అందరి కంటే ఎక్కువ బాధ్యత తీసుకున్నది హీరో నాని. మా కంటే ఎక్కువ తొడలు కొట్టాడు. మా కంటే ఎక్కువ కథను నమ్మాడు. నాకు అర్థం కాలేదు. ఆ సమయంలో ఈ కథలో అంతుందా అనిపించింది. మేము చూడని సినిమాను నాని ముందే చూశాడు.... అతడి అంచనాలు నిజం అయ్యాయి అని కోన వెంకట్ తెలిపారు.
ఫుల్ బాటిల్ కొట్టేశాడు
అమెరికాలో షూటింగ్ జరిగేపుడు వాతావరణం జీరో డిగ్రీలకు పడిపోయింది. పల్లవి, ఉమ మధ్య అప్పుడు ఓ సీన్ తీశాం. ఈ అమ్మాయిలు కూడా అస్సలు అర్థం కారు బాసూ అన్ని అలవాట్లు ఉన్న వారిని ప్రేమిస్తారు. ఏ అలవాటు లేని వారిని పెళ్లి చేసుకుంటారు అనే డైలాగులో ఫీల్ రావడం కోసం నాని ఫుల్ బాటిల్ కొట్టేశాడు. నాని అంత తాగడంతో మేమంతా కంగారుపడ్డాం. నానికి నేచురల్ స్టార్ అనే పేరు రావడానికి కారణం ఇదేనేమోణ? సీన్ నేచురల్‌గా రావడానికి ఇలా కూడా చేస్తారా? అనిపించింది అని కోన వెంకట్ వ్యాఖ్యానించారు.