సల్మాన్ ఖాన్ నెక్స్ట్ చిత్రానికి తెలుగు స్టార్ రైటర్ కథ వండుతున్నాడు
సల్మాన్ ఖాన్ వరసగా సౌత్ సినిమాలను రీమేక్ చేస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన తెలుగులో హిట్ అయిన రెడీ చిత్రం రీమేక్ చేస్తున్నాడు. ఆ కథ బాగా నచ్చటంతో ఆ కథ అందించిన రచయిత కోనవెంకట్ నే పిలిచి తన తదుపరి చిత్రానికి కధ ను రెడీ చేయిస్తున్నాడు. ఆ చిత్రం టైటిల్ 'షేర్ ఖాన్'.ఈ స్క్రిప్టు కోసం కోన వెంకట్ గత కొద్ది నెలలుగా ముంబైలోనే మకాం వేసినట్లు సమాచారం. ఫన్,ఎంటర్టైన్మెంట్ కలగిన కధాంశంగా ముఖ్యంగా పిల్లలకు నచ్చే ఎలిమెంట్స్ తో ఆ చిత్రం రెడీ అవుతోందని చెప్తున్నారు. అలాగే విజువల్ ఎఫెక్ట్స్ ప్రాధాన్యంగా 'షేర్ ఖాన్' రూపొందనుంది. ఈ చిత్రానికి సల్మాన్ సోదరుడు సోహైల్ ఖాన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.అలాగే ఈ చిత్రం అనంతరం సల్మాన్ ఖాన్ తెలుగులో మంచి హిట్ అయిన 'కిక్' సినిమాను కూడా రీమేక్ చేసే పనిలో ఉన్నాడు.


Click it and Unblock the Notifications











