కోన వెంకట్ హెచ్చరిక: 'కొంతమంది జోకర్లు'.. పవన్ మౌనాన్ని అలుసుగా తీసుకోవద్దు!..
ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగాక విమర్శలను తప్పించుకోవడం ఎంతటివారికైనా అసాధ్యమే. విమర్శలను తప్పుపట్టడమంటే జవాబుదారీతనం నుంచి సైడ్ అవపోవడమే అన్న విమర్శలు అదనంగా తోడవుతాయి.
ఈ సంగతి పక్కనపెడితే.. పవన్ కల్యాణ్ రాజకీయాలపై చాలానే విమర్శలు ఉన్నాయి. ఈ విమర్శలపై నేరుగా పవన్ కల్యాణ్ ఎప్పుడూ స్పందించలేదు. ఆయనకు మద్దతుగా అభిమానులు, కార్యకర్తలు తప్ప సినీ ఇండస్ట్రీ వాళ్లు గానీ, బయటి వ్యక్తులు గానీ ప్రత్యక్షంగా ఎప్పుడూ కల్పించుకోలేదు. రచయిత కోన వెంకట్ మాత్రం దీన్ని బ్రేక్ చేయాలనుకుంటున్నారేమో అనిపిస్తోంది..

కోన వార్నింగ్..:
'కొంతమంది జోకర్లు పవన్ కళ్యాణ్ మౌనాన్ని అలుసుగా తీసుకుంటున్నారు. అలా ఎంతమాత్రమూ భావించవద్దు' అని రచయిత కోన వెంకట్ హెచ్చరించారు. ఇప్పటికైతే పరోక్షంగానే సరిపెట్టిన కోన వెంకట్.. మున్ముందు ప్రత్యక్షంగానే పవన్ తరుపున కామెంట్స్ చేస్తారేమోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

గతంలో పవన్ కూడా..:
చూస్తూ ఉన్నాం కదా అని తమ మౌనాన్ని చేతకాని తనంగా భావించవద్దని, తెగేదాకా వస్తే చేతులు ముడుచుకుని కూర్చోమని గతంలో జనసేన శతఘ్ని టీమ్ తో సమావేశం సందర్భంగా పవన్ వ్యాఖ్యలు చేశారు.

ఎవరిని ఉద్దేశించి?:
కోన వెంకట్ అయినా.. పవన్ కల్యాణ్ అయినా పరోక్షంగా చేసిన ఈ కామెంట్స్ మహేష్ కత్తిని ఉద్దేశించినవేనా? అన్న సందేహం తలెత్తుతోంది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ పై ఆ స్థాయిలో విమర్శలు చేస్తున్న వ్యక్తి కత్తి మహేష్ ఒక్కరే కావడంతో.. కోన వెంకట్ ఆయన్ను ఉద్దేశించే కామెంట్ చేసి ఉంటారా? అన్న సందేహం ప్రశ్న వ్యక్తమవుతోంది.

బన్నీ వాసు..:
గీత ఆర్ట్స్ బ్యానర్ లో ఒకరైన బన్నీ వాసు కూడా గతంలో మహేష్ కత్తి విషయంలో గట్టిగానే స్పందించారు. 'మార్కెట్లో కత్తిలు, సుత్తిలు ఉంటాయి.. వాటి విషయం పవన్ ఫ్యాన్స్ పెద్దగా పట్టించుకోవద్దు' అని బన్నీ వాసు అప్పట్లో సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు.

ఇప్పట్లో ఆగేలా లేదు..:
ఇప్పటికైతే పవన్ కల్యాణ్-మహేష్ కత్తి వివాదం మరింత ముదిరి పాకాన పడినట్లే కనిపిస్తుంది తప్ప.. తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. పవన్ ఫ్యాన్స్ తన జీవితాన్ని డిస్టర్బ్ చేశారు కాబట్టి.. తాను కూడా పవన్ కల్యాణ్ రాజకీయాలపై స్పందిస్తూనే ఉంటానని మహేష్ కత్తి ఖరాఖండిగా చెబుతున్నారు.
అంతేకాదు, రాజ్యాంగ పరిధిలోనే తాను మాట్లాడుతానని, ఎవరికీ భయపడేది లేదని చెబుతున్నారు. మరోవైపు పవన్ ఫ్యాన్స్ కత్తిపై ఫైర్ అవుతూనే ఉన్నారు. దీంతో ఈ వివాదం ఇంకెంత దూరం వెళ్తుందోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


Click it and Unblock the Notifications











