వేరే పార్టీ వైపు...పవన్ సన్నిహితుడు కోన వెంకట్!

పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన ఏవిషయమైనా...ముందుగా స్పందించే వారిలో సినీ రచయిత అయిన కోన వెంకట్ ఒకరు. ఆయనకు ఎంతో సన్నిహితుడిని అని తనకు తానుగా చెప్పుకుంటూ ఉంటారు. పవన్ కళ్యాణ్ మాదిరిగానే కోన వెంకట్ కూడా 'కాంగ్రెస్ హటావ్....దేశ్ బచావ్' అంటూ నినదించడం గమనార్హం. పార్టీలు వేరైనా కాంగ్రెస్ పార్టీని గద్దె దించాలనే విషయంలో ఇద్దరూ ఒకే స్టాండుపై ఉన్నట్లు స్పష్టమవుతోంది.
కోన వెంకట్ సినిమా లైఫ్ విషయానికొస్తే....రచయిత కోన వెంకట్ తనదైన టాలెంటుతో ముందుకు సాగుతూ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. దర్శకుడు శ్రీను వైట్లతో పాటు పలువురు దర్శకులు తెరకెక్కించిన హిట్ చిత్రాల వెనక కోన వెంకట్ రచనా నైపుణ్యం ఉంది. ఇటీవల వచ్చిన మంచు ఫ్యామిలీ మల్టీస్టారర్ 'పాండవులు పాండవులు తుమ్మెద' చిత్రానికి కూడా కోన వెంకట్ స్క్రిప్టు అందించారు.
దర్శకత్వంలోకి దిగుతున్నానంటూ కోన వెంకట్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. తొలిసారిగా ఆయన ఓ ఫీచర్ ఫిల్మ్‌కు దర్శకత్వం వహించారు. 'రామ్ - జూలియట్' పేరుతో సాగే ఈచిత్రం న్యూయార్కు పరిసర ప్రాంతాల్లో షూటింగ్ పూర్తి చేసుకుంది. లాఫింగ్ బుద్ధ ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై వంశీ మాదిరాజు, రామ్ గోలీ ఈ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications