'దూకుడు' తప్పుడు సంకేతాలు ఇస్తే మర్చిపోండి
'''దూకుడు' పోస్టర్లు, ప్రొమోలు మీకేదైనా తప్పుడు సంకేతాలు ఇచ్చినట్టయితే దయచేసి వాటిని మరచిపోండి. ఇది శ్రీను వైట్ల మార్కు పూర్తి హ్యూమర్ చిత్రం'' అని రచయిత కోన వెంకట్ చెప్పారు. ఈ రోజు రిలీజ్ అవుతున్న దూకుడు చిత్రం గురించి మాట్లాడుతూ ఆయన ఇలా స్పందించారు. అలాగే.. సెంటిమెంట్, కామెడీ కలబోతగా ఆ చిత్రం తయారైందని తెలిపారు. 'పోకిరి' చిత్రంతో దీనికి ఎలాంటి పోలిక లేదని ఆయన తేల్చి చెప్పారు.ఇక నిరవధిక ఆందోళన కార్యక్రమాలకు తెలంగాణవాదులు పిలుపు ఇచ్చినప్పటికీ హైదరాబాద్‌లో మహేష్ బాబు అభిమానులు, సినీ జనాలకు 'దూకుడు' జ్వరం పట్టుకున్నట్టుగా కనిపిస్తోంది.
అందుకు తార్కాణంగా ప్రసాద్ మల్టిపెక్స్ వద్ద అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభించిన అర్ధ గంటలోనే టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. యూ/ఏ సెన్సార్ సర్టిఫికేట్ పొందిన 'దూకుడు' చిత్రం సెప్టెంబర్ 23న భారీ ఎత్తున విడుదల కావటానికి సన్నాహాలు చేసుకుంటోంది. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి హైదరాబాద్‌లో 69 సినిమా థియేటర్లు, ఉత్తరాంధ్రలో 54 సినిమా థియేటర్లలో ఉదయం నుంచే హడావిడి ప్రారంభమైంది. అంతేకాక తెలుగు సినీ చరిత్రలో రికార్టు సృష్టిస్తున్నట్టుగా అమెరికాలో 79 థియేటర్లలో 'దూకుడు' విడుదలవుతోంది. ఇక తమిళనాడు విషయానికి వస్తే చెన్నయ్, చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం 17 థియేటర్లలో విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











