శ్రీదేవితో సినిమా చేయబోతున్న కోన వెంకట్
ఆయన చెప్పిన వివరాల ప్రకారం....మూడు బాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారట. తెలుగు, తమిళం, హిందీలో తెరకెక్కే ఈచిత్రాన్ని శ్రీదేవి భర్త బోనీ కపూర్ నిర్మించబోతున్నారని ఆయన తెలిపారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోయే ఈచిత్రం ప్రస్తుతం చర్చల దశలో ఉంది.
ఇటీవల శ్రీదేవిని కలిసిన స్టోరీ చెప్పానని, సినిమా చేయడానికి ఆమె ఒప్పుకున్నారని, దర్శకుడు, ఇతర సాంకేతిక విభాగం, నటీనటుల వివరాలు త్వరలో వెల్లడిస్తానని కోన వెంకట్ తన ట్విట్టర్లో వెల్లడించారు. శ్రీదేవి మరో సినిమా చేయబోతోంది అనగానే ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా సౌతిండియాతో పాటు, బాలీవుడ్‌ను ఏలిన శ్రీదేవి నిర్మాత బోనీ కపూర్‌ను పెళ్లాడిన తర్వాత సినిమాలకు దూరమైంది. పిల్లల పెంపకానికే పరిమితం అయింది. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ఇంగ్లీష్ వింగ్లిష్ చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చి ఇప్పటికీ తనలో సత్తా తగ్గలేదని నిరూపించుకుంది.


Click it and Unblock the Notifications












