»   » నిన్నుకోరీ, మామ్: ఒకే రోజు రెండు విజయాలు, వెనక ఉన్నది "కోనా" ఒక్కడే

నిన్నుకోరీ, మామ్: ఒకే రోజు రెండు విజయాలు, వెనక ఉన్నది "కోనా" ఒక్కడే

Posted By:
Subscribe to Filmibeat Telugu

గత నెలరోజుల నుంచీ డీజే తప్ప బాక్సాఫీస్ ని పెద్దగా ఆనంద పెట్టిన సినిమాలేం లేవు. పోయిన వారమంతా థియేటర్లన్నీ మరీ ఈగలు తోలుకుంటున్నట్టే డీలాగా కనిపించాయి. కానీ ఈ వారం వచ్చిన రెండు సినిమాలూ ఒకరకంగా మళ్ళీ బాక్సాఫీస్ గుండెల్లో ఊపిరి నింపాయి. ఒకటి తెలుగు స్ట్రైట్ సినిమా "నిన్నుకోరి" అయితే రెండోది నిన్నటితరం అందాల నటి శ్రీదేవి లీడ్ రోల్ గా వచ్చిన "మామ్".

మొదటి షో తోనే

మొదటి షో తోనే

ఈ రెండు సినిమాలూ మొదటి షో తోనే విమర్శకుల మెదళ్ళని కట్టిపడేసాయ్.. పాజిటివ్ బజ్ లతో సోషల్ మీడియా గోడలన్నీ ఈ రెండు సినిమాలనీ నెత్తికెత్తుకున్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. ఈ రెండు సినిమాల వెనుకా ఉన్నది టాలీవుడ్ స్టార్ రైటర్ కోనా వెంకట్...

శ్రీను వైట్లతో కలిసి

శ్రీను వైట్లతో కలిసి

ఒకప్పుడు సక్సెస్ ఫుల్ రైటర్ గా ఒక వెలుగు వెలిగిన కోనా కొంతకాలంగా సైలెంటయిపోయారు. శ్రీను వైట్లతో కలిసి టాలీవుడ్ ని ఒక ఊపు ఊపేసిన కోనా, శ్రీను తో విడిపోయాక తానే సొంతంగా సినిమాలు చేయబోయి తడబడ్డాడు. గీతాంజలి, శంకరాభరణ లాంటి ప్రయోగాలు గట్టి దెబ్బనే వేసాయి.

కోనా ఇక తగ్గిపోతున్నాడు

కోనా ఇక తగ్గిపోతున్నాడు

కొంతకాలం బాగా సైలెంట్ గా ఉండిపోయాడు. కోనా ఇక తగ్గిపోతున్నాడు అన్న విమర్శలని తానే స్వయంగా విన్నాడు కూడా. అయితే వెంటనే రియాక్ట్ అయితే ఎలా? తానేమిటో చూపించాలి., అవును ఏ తెరమీదనుంచి తన పేరు వెలిగిందో అదే తెరమీద తన సమాధానం కనిపించాలి. అదే ప్రయత్నం లో ఇప్పుడు మళ్ళీ తానేమిటో చూపించాడు.

మలుపులు చాలానే తెలుసు

మలుపులు చాలానే తెలుసు

నిన్ను కోరి స్క్రీన్ ప్లే, మాటలూ, మామ్ కి స్టోరీ లైన్ అందించాడు. బేసిక్ గా రైటర్ కదా జీవితం లో మలుపులు చాలానే తెలుసు. వంపులూ, విశాదాలూ తెలుసు అందుకే కోనా ఏం చేసినా నిశ్శబ్దంగా ఉంతుంది... కానీ పూర్తయ్యాకే ఆ హోరు పిచ్చెక్కిస్తుంది. ఇప్పుడు నానీ సినిమా నిన్ను కోరి థియేటర్ లోకి వెళ్ళండి. కొన్ని మాటలకి కళ్ళలో నీళ్ళొచ్చేస్తాయి. ఆ స్క్రీన్ ప్లే ఒక సామాన్యమైన కథని కూడా ఎంత హార్ట్ టచింగ్ గా చెప్పొచ్చో నిరూపిస్తుంది. నిన్నుకోరి కి నిర్మాతగా కూడా వ్యవహరించాడు.

రిచ్ థాట్

రిచ్ థాట్

మామ్ లాంటి స్టోరీని అసలు సినిమాగా చేయొచ్చు అనుకోవటమే రిచ్ థాట్ దాన్ని కమర్శియల్ గా హిట్ చేయొచ్చు అని డైరెక్టర్ ని కనెక్ట్ చేయించటం ఒక సాహసం.కానీ తన కథ మీద ఉన్న నమ్మకం అది.ఈ రెండు సినిమాలూ ఒకే రోజు రావటం రెండిటికి రెండూ అద్బుతమైన రెస్పాన్స్ ని తెచ్చుకోవటం చూస్తే ఒక్కసారి కాన్సంట్రేషన్ చేస్తే ఒక దమ్మున్న రైటర్ ఎలాంటి స్టఫ్ ఇవ్వగలడో చెప్పకనే చెప్పినట్టయ్యింది.

రెండిటికీ పెద్ద బానిస కోనా వెంకట్

రెండిటికీ పెద్ద బానిస కోనా వెంకట్

ఈ రెండు సినిమాలతో తానేమిటో మళ్ళీ ఒకసారి చూపించాడు కోనా వెంకట్. ఈ రెండు సినిమాలతో మళ్ళీ కోనా వెంకట్ ఇండస్ట్రీలో తన పాత స్థానాన్ని నిలబెట్టుకున్నట్టే ఇక ముందు కూడా ఇదే రేంజ్ లో విజృంబిస్తాడనే ఆశించవచ్చు. ఎందుకంటే సినిమా ఒక వ్యసనం, రాయటం అంతకంటే పెద్ద వ్యసనం ఈ రెండిటికీ పెద్ద బానిస కోనా వెంకట్ అతనికి గెలవటం కోసం రాయటం రాకపోవచ్చు కానీ రాయటం కోసం గెలిచి చూపించటం వచ్చు.

English summary
‘Ninnu Kori’s producer Kona Venkat hogs limelight this week as ‘Mom’s story writer as well
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu