twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జూ ఎన్టీఆర్‌ గురించి అలా మాట్లడటం సబబేనా?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ తీరు ఈ మధ్య ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయింది. జూ ఎన్టీఆర్ గుడ్డిగా ముందుకు సాగుతున్నాడని, అందుకే ఆయన పరిస్థితి ఇలా దిగజారిందనేది చాలా మంది వాదన. ఇలాంటి వాదన రావడానికి కారణం ఆయన సినిమాలు ఎదుర్కొంటున్న పరాజయాలే.

    హిట్ కొట్టిన డైరెక్టర్లతో చేస్తే సక్సెస్ బాట పడతాం...ఇండస్ట్రీలోని హీరోలంతా దాదాపుగా ఇలా ఆలోచిస్తారు. అఫ్ కోర్స్ కొన్ని సందర్భాల్లో ఈ సూత్రం బాగానే పని చేసినా, చాలా సందర్భాల్లో అంచనాలు తప్పుతాయి. కథలో దమ్ము, కథనంలో పర్‌ఫెక్ట్‌నెస్ ఉంటే తప్ప విజయతీరాన్ని చేరుకోలేం అనే ప్రాథమిక సూత్రాన్ని మంచిపోతారు చాలా మంది స్టార్స్. ఎన్టీఆర్ కూడా ఇలానే ప్రవర్తిస్తున్నానేది పలువురి అభిప్రాయం.

    అయితే ఈ అభిప్రాయం పూర్తిగా తప్పు అని వాదిస్తున్నారు స్టార్ రైటర్ కోన వెంకట్. ఎన్టీఆర్ గురించి జరుగుతున్న ఈ ప్రచారాన్ని ఆయన ఖండించారు. 'బాద్ షా' చిత్రం చేయాలని నిర్ణయించుకున్నపుడు శ్రీనువైట్ల 'దూకుడు' సినిమా ఇంకావిడుదల కాలేదు. 'మిరపకాయ్' చిత్రం సమయంలోనే హరీష్ శంకర్‌తో పని చేయాలని ఎన్టీఆర్ డిసైడ్ అయ్యారు. కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయింది. అంతే కానీ 'గబ్బర్ సింగ్' విజయం చూసి కాదని...తేల్చి చెప్పారు కోన వెంకట్.

    సంవత్సరన్నర క్రితమే సమంత, ప్రణీతలను 'రభస' చిత్రంలో తీసుకోవాలని అనుకున్నారు. కానీ కాకతాళీయంగా వారిద్దరూ 'అత్తారింటికి దారేది' చిత్రంలో కూడా నటించారు. పలువురు దర్శకులు సక్సెస్ పుల్ చిత్రాలు చేసిన తర్వాత ఎన్టీఆర్ లాంటి పెద్ద హీరోతో చేయాలని కోరుకుంటున్నారనేది నా అభిప్రాయం...అంతకు మించి మరేమీ కాదు. ప్రతి దర్శకుడు ఎన్టీఆర్ లాంటి హీరోతో చేయాలని కోరుకుంటున్నారనే వాస్తవం.

    రాజమౌళి, వివి వినాయక్ లాంటి టాప్ దర్శకులను పరిశ్రమకు పరిచయం చేసింది జూ ఎన్టీఆర్ అనే విషయం ఎవరూ మరిచి పోవద్దు. ఎన్టీఆర్‌ను టార్గెట్ చేయడం మానండి. ఇది చాలా సున్నితమైన అంశం అని....కోన వెంకట్ తన ట్విట్టర్లో చెప్పుకొచ్చారు.

    English summary
    "It's absolutely wrong to say that NTR is running behind successful directors or combinations.. When he has decided to work for "Baadshah" Dookudu was still under production. He has agreed to do a film with Harish soon after "Mirapakai " but it eventually happened after GS.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X