»   » క్లారిటీ: పవన్ పొలిటికల్ ఎంట్రీపై...కోన వెంకట్ ట్వీట్

క్లారిటీ: పవన్ పొలిటికల్ ఎంట్రీపై...కోన వెంకట్ ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu
kona venkat tweet about Power Star
హైదరాబాద్: ఓ వైపు రాష్ట్ర విభజన నేపథ్యంలో పరిస్థితి వాడి వేడిగా ఉంది. రాష్ట్రాన్ని కాపాడేందుకు ఇదే అదునుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ ఆరంగ్రేటం చేయబోతున్నారంటూ ప్రముఖ టీవీ ఛానళ్లు, వార్తా పత్రికల్లో వార్తలు. ఈ వార్తలు నమ్మాలో? లేదో అనే అయోమయంలో అభిమానులు.

ఈ నేపథ్యంలో పవన్ సన్నిహితుల్లో ఒకరైన నినీ రచయిత కోన వెంకట్ ట్విట్టర్ ద్వారా అయోమయానికి తెర దించారు. 'పవన్ కళ్యాణ్ గురించి ప్రచారం జరుగుతున్న రూమర్లను నమ్మ వద్దని, అవన్నీ నిరాధారమైనవి, సెన్స్ లెస్' అంటూ ఆయన ట్వీట్ చేసారు. కోన వెంకట్ ట్వీట్ పవన్ అభిమానులను కాస్త ఊరట పరిచినట్లయింది.

పవన్ కల్యాణ్‌లోకి వెళ్తారా? అనే చర్చ గత కొద్ది రోజులుగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. తన సోదరుడు, పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేసినప్పటి నుండి పవన్ అసంతృప్తిగా ఉంటున్నారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా పవన్ టిడిపి వైపు అడుగులు వేస్తున్నారనే ప్రచారం మొదలైంది.

ఇటీవల పవన్ కళ్యాణ్ టీడీపీ నేత, నటుడు బాలకృష్ణతో పాటు, ఈనాడు సంస్థల అధినేత రాజమోజీ రావును కలిసాడని, ఇదంతా టీడీపీ తీర్థం పుచ్చుకునే ప్రయత్నంలో భాగమే అని.....పుకార్లు షికార్లు చేసాయి. పలువురు టీడీపీ నేతలు పవన్ వస్తే ఆహ్వానిస్తామని బహిరంగ ప్రకటనలు చేయడం గమనార్హం.

ఇలాంటి అయోమయ పరిస్థితికి....రచయిత కోన వెంకట్ ట్వీట్ ద్వారా తెర దించారు.

English summary

 "Pl don't believe any rumours about Power Star .. They are all baseless & senseless!!" kona venkat tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu