For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  తెగేదాకా వచ్చింది: 'కత్తి'కి కోన వెంకట్ డెడ్ లైన్?, ఆరోజు ఏం చేస్తారు?; సీన్ లోకి వేణుమాధవ్..

  |
  'కత్తి'కి కోన వెంకట్ డెడ్ లైన్ ? ఆరోజు ఏం చేస్తారు ?

  ఆదివారం నాడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో పెట్టిన మీటింగ్‌తో మహేష్ కత్తి-పవన్ కల్యాణ్ మధ్య వివాదం ముదిరి పాకాన పడింది. ఇప్పటిదాకా పవన్ వ్యక్తిగత విషయాలను ప్రస్తావించకుండా సంయమనం పాటిస్తూ వచ్చిన కత్తి మహేష్.. ఇప్పుడు ఆ హద్దును కూడా దాటేశారు.

  అయితే సీన్ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ పూనం కౌర్ కత్తి మహేష్ పై చేసిన వ్యాఖ్యల పర్యవసానమే ఆయన సంధించిన ప్రశ్నలు అనుకోవచ్చు. ఏదేమైనా పవన్ దిగొచ్చేదాకా తన పోరాటం ఆగదంటున్న మహేష్ కత్తిపై ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల నుంచి గట్టి ప్రతిస్పందన మొదలైంది. హైపర్ ఆది మరోసారి ఘాటు విమర్శలు చేయగా.. కోన వెంకట్ సున్నితంగా ఓ విజ్ఞప్తి చేశారు.

   కోన వెంకట్ 'అప్పీల్'..:

  కోన వెంకట్ 'అప్పీల్'..:

  'ఈ నెల 15వ తేదీ వరకు అందరూ మౌనంగా ఉండండి, మౌనం ఎప్పటికీ మోసం చేయదు. పవన్ అభిమానులతో పాటు కత్తి మహేశ్ కూడా మౌనం వహించి మీడియా హౌజ్ లకు, పవన్ పై వ్యతిరేక వ్యాఖ్యలకు కాస్త దూరంగా ఉండండి. లేదంటే సయోధ్య కుదుర్చాలనుకున్న ప్రయత్నం విఫలమవవుతుంది'.

   ఎందుకీ డెడ్ లైన్?:

  ఎందుకీ డెడ్ లైన్?:

  జనవరి 10వ తేదీన అజ్ఞాతవాసి సినిమా విడుదలకు సిద్దమవుతున్న నేపథ్యంలోనే.. ఈ కొద్ది రోజులు అందరూ సంయమనం పాటించాల్సిందిగా కోన వెంకట్ అప్పీల్ చేసినట్లు అర్థమవుతోంది. కానీ జనవరి 15వరకు అని ఒక డెడ్ లైన్ పెట్టారంటే.. ఆరోజు పవనే నేరుగా రంగంలోకి దిగుతారా? అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

  ఫుల్ స్టాప్ పెడుతారా?:

  ఫుల్ స్టాప్ పెడుతారా?:

  ఇప్పటిదాకా పవన్ కల్యాణ్ కత్తి మహేష్‌పై నేరుగా స్పందించలేదు. పరిస్థితి వ్యక్తిగత విషయాల దాకా వెళ్లడంతో.. తన అనుయాయిలతో వివాదాన్ని సద్దుమణిగించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారేమో అన్న సంకేతాలు వెలువడుతున్నాయి.

  సామాజికంగానూ పవన్ రాజకీయాలకు కత్తి మహేష్ వివాదం ఏమాత్రం మంచిది కాదు కాబట్టి.. ఇక దీనికి ఫుల్ స్టాప్ పెట్టే యోచనలో ఆయన ఉన్నట్లు సమాచారం.

  కత్తి.. ఓ సైకో: హైపర్ ఆది

  కత్తి.. ఓ సైకో: హైపర్ ఆది

  ఇక జబర్దస్త్ నటుడు హైపర్ ఆది గతంలో లాగే కత్తి మహేష్ పై విరుచుకుపడ్డాడు. 'అనవసరమైన వాళ్లకి అర్హత లేని వాళ్ళకి అనుచితంగా స్టార్‌ చైర్‌ వేసి కూర్చోపెట్టకండి. అతను ఒక సైకో. అతనికి కావాల్సింది డబ్బు. విలువలూ ప్రేమలూ కాదు. ఏ అనుబంధాలు లేని వాడికి ఇవ్వన్నీ అర్థంకావు. అనవసరమైన ఎక్సైట్‌మెంట్‌తో, క్యూరియాసిటీతో ఇది వరకే ఒకరిని అందలం ఎక్కించారు. ఇదంతా ఆపేయండి' అని ట్వీట్ చేశాడు.

   ఆది మరో ట్వీట్:

  ఆది మరో ట్వీట్:

  'ఫ్యాన్స్‌ అందరికి ఒక విన్నపం. కత్తి మహేశ్‌ను ప్రతి ఒక్కరూ అన్‌ఫ్రెండ్‌ చేసి బ్లాక్‌ చేయండి. అతన్ని ఏకాకిని చేయండి. అతనో మానసిక రోగి. అతనికి ఏ ఫ్యాన్‌ కూడా స్పందించకూడదని కోరుకుంటున్నా. వాడి ట్వీట్‌ కింద ఏ ఒక్కరూ దయచేసి రీట్వీట్‌లు పెట్టకండి' అని విజ్ఞప్తి చేశాడు.

   అంకుల్ అంటూ వేణుమాధవ్:

  అంకుల్ అంటూ వేణుమాధవ్:

  పవన్, జనసేన అభిమానులందరూ లైవ్ లో కత్తి మహేష్ తో మాట్లాడవద్దని కమెడియన్ వేణు మాధవ్ సూచించారు. 'మా' సభ్యురాలు పూనమ్ కౌర్ పై సంచలన ఆరోపణలు చేసినందుకు తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అంతేకాదు, మహేష్ కత్తి అంకుల్ ను గౌరవించాల్సిన బాధ్యత తమకు ఉందని సెటైర్ వదిలారు. కత్తి మహేష్ ఆరోగ్యం పాడై ఉంటుందని పేర్కొన్నారు.

   ఎదుర్కొంటా..: మహేష్ కత్తి

  ఎదుర్కొంటా..: మహేష్ కత్తి

  పవన్ కల్యాణ్, త్రివిక్రమ్, పూనం కౌర్ లపై తాను సంధించిన ప్రశ్నలకు కట్టుబడి ఉంటానని కత్తి మహేష్ చెబుతున్నారు. చెప్పడమే కాదు, తన వద్ద వీడియో ఆధారాలు కూడా ఉన్నాయని, ఫోరెన్సిక్ కూడా వాటిని ధ్రువీకరించేంత పక్కాగా ఉన్నాయని అంటున్నారు.

  తన ఆరోపణలు తప్పయితే కోర్టుకు వెళ్లండని, సాక్ష్యాధారాలతో అక్కడే తేల్చుకుంటానని అన్నారు. అంతేకాదు, తన ప్రశ్నల వల్ల పూనం కౌర్ జీవితానికే మేలు జరుగుతుందని, ఈ విషయాలు బయటపెట్టడం తన అసలు ఉద్దేశం కాకపోయినా.. తనను ఇక్కడిదాకా తీసుకొచ్చారని అన్నారు.

   కత్తికి కూడా పెరుగుతున్న మద్దతు:

  కత్తికి కూడా పెరుగుతున్న మద్దతు:

  మరోవైపు మహేష్ కత్తికి కూడా అటు సోషల్ మీడియాలోను, సామాజికంగాను మద్దతు లభిస్తుండటం గమనార్హం. చూసేవాళ్లకు వీడికేమైనా పిచ్చా? అనిపించవచ్చు కానీ ఒక అభిమాన హీరోకి ఊడిగం చెయ్యడానికి ఆత్మగౌరవం కోసం పోరాటం చెయ్యడానికి ఎంత తేడా ఉందో ఇప్పుడు తెలుస్తుందంటూ కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

  English summary
  The controversy surrounding Kathi Mahesh’s comments on Pawan Kalyan and the backlash that followed is growing bigger by the day. Now, a few members from the Telugu film fraternity are urging everyone to call a truce, at least for the time-being, so that issues can be settled amicably.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more