twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Konda movie Trailer: 47 బుల్లెట్స్ దిగినా ఎందుకు బతికానంటే? కొండా మురళి ఎమోషనల్

    |

    తెలంగాణ రాజకీయాల్లో ఎదురులేని నేతలుగా ఎదిగిన కొండా సురేఖ, కొండా మురళీ జీవితంలోని కొన్ని సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం కొండా. ఈ బయోపిక్‌కు ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రారంభమైనప్పటి నుంచి ఏదో ఒక వివాదం వెంటాడుతూనే ఉంది. జనవరి 26వ తేదీన ట్రైలర్ రిలీజ్ చేయాలని నిర్ణయించినప్పుడు జిల్లాలో రాజకీయ ప్రభావం ఉన్న కొందరు నేతలు అడ్డుకొనేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో మంగళవారం రాత్రి కొండా సురేఖ, ఆర్జీవి ఓ వీడియోను రిలీజ్ చేశారు. కొండా సినిమా ట్రైలర్‌ను రిలీజ్‌ను ఆపే దమ్ముందా అంటూ ప్రశ్నించారు. అనుక్షణం టెన్షన్ వాతావరణంలో ఈ ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..

    ఆర్జీవీకి రెండు ముక్కలు చెబితే..

    ఆర్జీవీకి రెండు ముక్కలు చెబితే..

    కొండా మురళి మాట్లాడుతూ "నేను ఆర్జీవీకి రెండు ముక్కలు చెబితే... ఆయన వంద మంది దగ్గర ఎంక్వైరీ చేసి కన్ఫర్మ్ చేసుకుని సినిమా తీశారు. ఆయన రెండు నెలల పదహారు రోజులువరంగ‌ల్‌లో ఉండి షూటింగ్ చేశారు. ఎక్కడాఉండని ఆయన రెండున్నర నెలల ఇక్కడ ఉన్నారంటే కథ ఎంత నచ్చిందోతెలుస్తోంది. ఇదే జనవరి 26న నా మీద 47 బుల్లెట్లు ఫైరింగ్ చేశారు. అయినా బతికాను. అది కూడా మా కుటుంబం కోసం కాదు, ప్రజల కోసమని తెలియజేస్తున్నాను. సినిమా గురించి చెప్పడం కన్నా చూస్తే బావుంటుంది. త్రిగుణ్బాగా నటించాడు. సురేఖ కంటే ఇర్రా మోర్ అందంగా ఉన్నారు. బాగా నటించింది" అని అన్నారు.

    ఆనాడు రక్తపు మడుగులో కొండా మురళిని చూసి

    ఆనాడు రక్తపు మడుగులో కొండా మురళిని చూసి

    కొండా సురేఖ మాట్లాడుతూ"ట్రైలర్ చూశాకమేం ఎంత బాధ అనుభవించామనేది గుర్తొచ్చింది. భావోద్వేగానికి లోనయ్యా. ముఖ్యంగా ఫైరింగ్ఘటనను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ రోజు కూడా జనవరి 26. నేను వెళ్లేసరికి మురళిగారువైట్ లాల్చీ పైజామాలో రక్తపు మడుగులో పడి ఉన్నారు. ఆయన చుట్టూ జనం నిలబడి ఉన్నారు. నా కూతురు ఎక్కడ ఉందో కనపడలేదు. నన్ను ఆయన దగ్గరకు వెళ్లనివ్వడం లేదు. మరణించాడనిఅన్నారు. ఆ రోజు ఆయన మరణించి ఉంటే... ఈ రోజు మేం ఎక్కడ ఉండేవాళ్లమో? మా కుటుంబం ఎక్కడ ఉండేదో? అసలు, మా పరిస్థితి ఏంటో? ఆలోచించడానికి కూడా కష్టంగా ఉంది. దేవుడు నాకు ఇచ్చిన పసుపు కుంకుమ బలం కొండామురళిగారుమన ముందు ఉండటం. మా పుట్టినరోజులు, పెళ్లి రోజు, పండగలకుఆయన కాళ్లు మొక్కుతా. ఇటీవల తొలిసారి అడిగా... 'కాళ్లు మొక్కినప్పుడు ఏం అనుకుంటారు?' అని. 'నీ తాళిబొట్టు గట్టిది అనుకుంటాను' అని చెప్పారు.

    ఆర్జీవి గురించి విన్నదంతా అబద్ధం

    ఆర్జీవి గురించి విన్నదంతా అబద్ధం

    ఆర్జీవీ గారి గురించి బయట విన్నదానికి, చూసిన దానికి అసలు సంబంధం లేదు. ఆయన గురించి బయట చెప్పేవన్నీ అబద్దాలు. ప్రపంచంలో ఆయనకు తెలియనిది ఏదీలేదు. మురళి గారిపాత్రను త్రిగుణ్దింపేశాడు. ఇర్రా మోర్ నాపాత్ర గురించి చెప్పింది. మా జీవిత చరిత్రను ఎలా తీయాలనేది మాకు ఐడియా లేదు. కలిసివచ్చే కాలానికి నడిచి వచ్చే కుర్రాడు వస్తాడన్నట్టు దేవుడు మాకు ఆర్జీవీని చూపించారు. మేం పడ్డ కష్టాలు రామాయణం, మహాభారతం కంటే ఎక్కువ. వాటిని తర్వాత ఏదో ఒక రూపంలో ఆర్జీవీగారు బయటకు తీసుకువస్తారని ఆశిస్తున్నాను" అని చెప్పారు.

    కొండా పెద్ద మాస్ మూవీ

    కొండా పెద్ద మాస్ మూవీ

    హీరో త్రిగుణ్మాట్లాడుతూ "నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఈరోజు ఇలా హీరోగానిలబడటం నా బిగ్గెస్ట్ సక్సెస్ అని భావిస్తున్నాను. ట్రైలర్ విడుదల రోజున ఎందుకు సక్సెస్ అంటున్నానంటే... కొండా మురళి, సురేఖ గురించి రామ్ గోపాల్ వర్మ తీసిన ఒక యాక్షన్, నక్సలైట్బ్యాక్‌గ్రౌండ్‌, తెలంగాణ సినిమాలో హీరో అంటే ఇంతకన్నా పెద్ద మాస్ ఏముంటుంది? నా సినిమాలుచూసి ఉంటారు. ఇప్పటి వరకూచాలా లవ్ స్టోరీలు చేశా. ఈ సినిమా నాకు కొత్తగా ఉంటుంది. 'నేను కొత్తగా వస్తున్న సంగతి బయట కూడా తెలియాలి. పేరు మార్చుకుందామని అనుకుంటున్నాను' అని వర్మతో చెబితే... 'మార్చుకో' అన్నారు. త్రిగుణ్ పేరు ఫైనలైజ్ చేశాం" అని అన్నారు.

    ఆర్జీవి కథ చెప్పినప్పుడు ఏడ్చా

    హీరోయిన్ ఇరా మోర్ మాట్లాడుతూ "రామ్ గోపాల్ వర్మ కథ చెప్పినప్పుడు నా కళ్ల వెంట నీళ్లు వచ్చాయి. జీవితంలో ఎన్నో కష్టాలను దాటుకుని సురేఖ గారు ముందుకు వచ్చారు. ఆమెలా చేయడం మహిళలకుఅంత ఈజీ కాదు. మురళి గారితో ప్రేమలో పడటం, కష్టాల్లో ఆయనకు అండగా ఉండటం... గాళ్ ఫ్రెండ్స్ అందరూ అలా చేయరు. ఒకరికి ఒకరు అండగా నిలబడ్డారు. సురేఖ గారు స్ట్రాంగ్ లేడీ. ఆమె పాత్ర చేయాలని అనిపించింది. ఆ పాత్రకు నేను 50 శాతం న్యాయం చేసినాహ్యాపీగా ఫీల్ అవుతా. రామ్ గోపాల్ వర్మ లాంటి దర్శకుడు మాత్రమే ఈ సినిమా తీయగలరు. యాక్టింగ్, పెర్ఫార్మన్స్ పరంగా ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను" అని చెప్పారు.

    Recommended Video

    Kovera Plans 100 Cr Budget Movie For Pawan Kalyan | FilmiBeat Telugu
    కొండా చిత్రంలో నటీనటులు, సాంకేతిక నిపుణులు

    కొండా చిత్రంలో నటీనటులు, సాంకేతిక నిపుణులు

    నటీనటులు: త్రిగుణ్, ఇరా మోర్, పృథ్వీరాజ్, పార్వతి అరుణ్, ప్రశాంత్, ఎల్బీ శ్రీరామ్, తులసి, 'జబర్దస్త్' రామ్ ప్రసాద్, అభిలాష్ చౌదరి, శ్రవణ్, అనిల్ కుమార్ రెడ్డి లింగంపల్లి, గిరిధర్ చంద్రమౌళి, రవి, షబీనా తదితరులు
    ఆర్ట్: అంజి, ఆటో జానీ
    ఎడిటింగ్: మనీష్ ఠాకూర్
    ఫైట్స్: శ్రీకాంత్
    మాటలు: భరత్
    సినిమాటోగ్రఫి: మల్హర్ భట్ జోషి
    సమర్పణ: శ్రేష్ఠ పటేల్ మూవీస్
    నిర్మాణం: ఆపిల్ ట్రీ, ఆర్జీవీ ప్రొడక్షన్
    కథ, కథనం, దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ

    English summary
    Warangal Political leaders Konda Murali, Surekha gets emotional at Ram Gopal Varma's Konda Movie trailer release event. Konda movie based on Thier life journey.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X