For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  తిరకాసు సమాధానం నాకు నచ్చదు.. స్టేజ్ పైనే ఆర్జీవికి కౌంటర్ ఇచ్చిన కొండా సురేఖ

  |

  కొండా సురేఖ, కొండా మురళి జీవిత ఆధారంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన కొండా సినిమా జూన్ 23న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను శనివారం వరంగల్ లో గ్రాండ్ గ్రా నిర్వహించారు. ఈ వేడుకలో కొండా సురేఖ తన స్పీచ్ తో ఎంతగానో ఆకట్టుకున్నారు. ఇక ఆమె ఏం మాట్లాడారు అనే వివరాల్లోకి వెళితే...

  వేరే మార్గం..

  వేరే మార్గం..


  ముందుగా ఈ సినిమాను తెరపైకి తీసుకువచ్చిన దర్శకుడు రాంగోపాల్ వర్మ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అసలైతే ఈ వేడుకకు రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా రావాల్సింది. కానీ ఆయనను రాకుండా దయాకర్ రావు తన అధికారంతో అడ్డుకున్నారు. ఇలాంటి సంఘటనలు నా జీవితంలో చాలా జరిగాయి. ఇక అలాంటివన్నీ తెరకెక్కించాలని అంటే ఒక సినిమాలో సరిపోయేది కాదు. వాటికి వేరే మార్గం వెతుక్కోవాలి అని రాంగోపాల్ వర్మ కు కొండా సురేఖ తెలియజేశారు.

   స్టేజ్ పైనే ఐ లవ్యూ

  స్టేజ్ పైనే ఐ లవ్యూ

  అలాగే భర్త గురించి మాట్లాడుతూ కొండా సురేఖ ప్రత్యేకంగా ఐ లవ్యూ కూడా చెప్పారు.. నా జీవితంలో ఎప్పుడు కూడా ఆయనకు ఐలవ్యూ చెప్పలేదు. ఇప్పుడు ఈ విధంగా స్టేజ్ పైనే మొదటి సారి ఐ లవ్యూ చెబుతున్నాను. నేను ఆయనను కాలేజీలో చూడకపోయి ఉంటే మా అమ్మ నన్ను ఎవరైనా ఉద్యోగికి ఇచ్చి పెళ్లి చేసి ఉండేవారు. అలాగే నేను ఈ రోజూ కొండా మురళి భార్యగా ఇక్కడ మీ ముందు నిలబడదాన్ని కాదు. ఇక నా జీవితచరిత్ర కూడా వారితో తెరకెక్కడం సంతోషంగా ఉందని అన్నారు.

  ఆర్జీవికి ఫ్యామిలీ అంటే ఇష్టం

  ఆర్జీవికి ఫ్యామిలీ అంటే ఇష్టం


  అలాగే కొండా సురేఖ తన కూతురు గురించి మాట్లాడుతూ ఆమె ఎన్నో కష్టాలు ఎదుర్కొని కూడా తన కాళ్ళ మీద తను నిలబడుతుంది అని.. ఇక నా మనవరాలు కారణంగా ఈరోజు నేను కొంత ప్రశాంతంగా ఉన్నాను అంటూ అని కొండా సురేఖ తెలియజేశారు. ఇక ఆర్జీవి గారికి కూడా ఫ్యామిలీ అంటే చాలా ఇష్టమని వారి అమ్మగారు సోదరి కూడా ఈ వేడుకలో వివరణ ఇచ్చారు.

  తిరకాసు సమాధానం వద్దు

  తిరకాసు సమాధానం వద్దు


  ఇక మా అల్లుడు అభిలాష్ మా కుటుంబాన్ని భరిస్తున్నాడు అలాగే ఆర్జీవి గారు కూడా ఇబ్బంది పడకుండా కొండ కుటుంబన్నీ బరిస్తున్నారు అని కొండా సురేఖ స్టేజీపైన చెప్పేశారు. ఇక అదే విషయాన్ని రాంగోపాల్ వర్మని నిజమెగా అని ఆడగడంతో ఆయన ఎంజాయ్ మెంట్ తో పాటు బరిస్తున్నాను అని అన్నారు. దీంతో తిరకాసు సమాధానం చెప్పవద్దని స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా సమాధానం చెప్పాలని రాంగోపాల్ వర్మను కొండా సురేఖ డైరెక్ట్ గా అడగడంతో ఆయన చివరకు చెబుతాను అని అన్నారు.

  ఆమె చాలా కష్టపడింది

  ఆమె చాలా కష్టపడింది

  ఇక కొండా సురేఖ పాత్రలో నటించిన ఇరా మోర్ గురించి మాట్లాడుతూ ఆమె గురించి మొదట నాకు తెలియదు అని బాంబే అమ్మాయి అని తెలియగానే ఎలా చేస్తుందో అని అనుకున్నానని అన్నారు. కానీ ఆ అమ్మాయి నా వీడియోలు అన్ని చూసి ఆమె చాలా జాగ్రత్తగా చేసిందని ఈ సినిమాలో నా క్యారెక్టర్ చేయడానికి చాలా కష్ట పడినట్లు కూడా అర్థమైందని కొండా సురేఖ మాట్లాడారు.

  English summary
  Konda surekha strong speech in konda movie pre release event
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X