సంవత్సరం క్రిందే చెప్పాడు.. నాకు ముందే తెలుసు.. రామ్ చరణ్ మామ బయటపెట్టిన షాకింగ్ నిజం
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ మామ, ఉపాసన బాబాయ్, రాజకీయ వేత్త కొండా విశ్వేశ్వర్ రెడ్డి తాజాగా ఓ యూ ట్యూబ్ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా మెగా ఫ్యామిలీతో అనుబంధం, చిరంజీవి పట్ల ఆయన అభిప్రాయం, సైరా నరసింహా రెడ్డి సినిమా గురించి కొన్ని విషయాలు చెప్పారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ఆ సంగతులేంటో చూద్దామా..

కొండా విశ్వేశ్వర్ రెడ్డి పొలిటికల్ జర్నీ
2014 సార్వత్రిక ఎన్నికల్లో చేవెళ్ల నియోజక వర్గం నుంచి టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసిన కొండా విశ్వేశ్వర రెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన అదే చేవెళ్లలో ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో తన రాజకీయ విశేషాలతో పాటు మెగా ఫ్యామిలీ, సినిమాల గురించి ఆసక్తికరంగా స్పందించారు కొండా విశ్వేశ్వర రెడ్డి.

సంవత్సరం క్రిందే చెప్పాడు.. ముందే తెలుసు
చిరంజీవి హీరోగా రాబోతున్న 'సైరా నరసింహా రెడ్డి' సినిమా స్టోరీ తనకు ముందే తెలుసని అన్నారు కొండా విశ్వేశ్వర రెడ్డి. రామ్ చరణ్ తనకు సంవత్సరం క్రిందే ఈ స్టోరీ చెప్పాడని, అయితే ఆ సమయంలో అది ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి స్టోరీ అన్నాడని చెప్పారు. ఇప్పుడదే స్టోరీ 'సైరా నరసింహా రెడ్డి' సినిమాగా వస్తోందని, ఈ సినిమా చూడాలని ఆతృతగా ఉందని ఆయన అన్నారు.

చిరంజీవి గురించి మాట్లాడుతూ..
చిరంజీవి తనకు పెద్దగా పరిచయం లేనప్పటికీ ఆయన చాలా నైస్ పర్సన్ అని అన్నారు కొండా. డౌన్ టు ఎర్త్ ఎదిగిన మహా మనిషి ఆయన అంటూ చిరుని ఆకాశానికెత్తారు. మెగాస్టార్ అయినప్పటికీ ఆయన చాలా సింపుల్ పర్సన్ అని చెప్పారు. రాజకీయాల్లో ఉన్నపుడు కూడా చిరంజీవి తనకు చాలా మందిని పరిచయం చేశారని, చిరంజీవి చాలా మంచి వ్యక్తి అని కొండా విశ్వేశ్వర రెడ్డి చెప్పారు.

సైరా నరసింహా రెడ్డి సినిమా
ఇక సైరా నరసింహా రెడ్డి సినిమా విషయానికొస్తే.. సైరా నరసింహా రెడ్డి కథ 1857 బ్రిటిష్ కాలం నాటిది కావడంతో అప్పటి పరిస్థితులకు అద్దంపట్టేలా భారీ సెట్స్ వేసి రూపొందించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ప్యాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ సినిమాకు రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించారు. అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలకమైన పాత్రల్లో నటించారు. అక్టోబర్ 2న భారీ అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











