వావ్! బ్యూటిఫుల్....(నాగ‌బాబు కూతురు ఫోటోలు)

By Bojja Kumar

హైదరాబాద్: ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ నుంచి హీరోలు మాత్రమే వచ్చారు. త్వరలో ఆ ఫ్యామిలీ నుంచి సినిమా హీరోయిన్ కూడా రాబోతుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆమె మరెవరో కాదు....మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక. ప్రస్తుతం షార్ట్ ఫిల్మ్స్‌లో నటిస్తున్న నిహారిక త్వరలోనే వెండితెరంగ్రేటం చేసే అవకాశం ఉంది.

ఇప్పటికే నిహారిక సోషల్ నెట్కవర్కింగులో యాక్టివ్‌గా ఉంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా నిహారిక తన అందమైన ఫోటోలను విడుదల చేస్తూ అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఆమో జోరు చూస్తుంటే త్వరలోనే సినిమారంగంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

రాజమౌళి తనయుడు కార్తికేయ రూపొందిస్తున్న షార్ట్ ఫిల్మ్‌‌లో నాగ బాబు కూతురు నిహారిక, నాగార్జున తనయుడు అఖిల్ కలిసి నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోలో ఆ మధ్య షార్ట్ ఫిల్మ్‌కు సంబంధించిన షూటింగు కూడా జరిగింది. మిగతా వివరాలు స్లైడ్ షోలో...

మెగా ఫ్యామిలీ నుంచి తొలి హీరోయిన్

మెగా ఫ్యామిలీ నుంచి తొలి హీరోయిన్

ఇప్పటి వరకు మెగా స్టార్ కుటుంబం నుంచి దాదాపు అరడజనుకు ‌పైగా హీరోలు వెండి తెరకు పరిచయం అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఆ కుటుంబం నుంచి ఒక్క హీరోయిన్ కూడా వెండి తెరకు పరిచయం కాలేదు. మెగాస్టార్‌కు ఇద్దరు కూతుర్లు ఉన్నప్పటికీ వాళ్లు మొదటి నుంచీ పూర్తిగా సినీ రంగానికి దూరంగానే ఉంటూ వచ్చారు. నిహారిక తెరంగ్రేటం చేస్తే ఆమె మెగా కుటుంబం నుంచి వచ్చే తొలి హీరోయిన్ అవుతుంది.

అభ్యంతరం లేదంటున్న నాగబాబు

అభ్యంతరం లేదంటున్న నాగబాబు

నాగ బాబు తనయ నిహారిక హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చే ఆలోచనలో ఉంది. ఆమె ఆలోచనకు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కూడా ఉంది. ఇటీవల నాగబాబు మీడియాతో మాట్లాడుతూ.....నిహారికకు ఇంట్రెస్టు ఉంటే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసారు.

తెలివైన అమ్మాయి

తెలివైన అమ్మాయి

నిహారిక చాలా తెలివైన అమ్మాయి అని, ఏ విషయాన్నయినా చాలా కూల్‌గా సాల్వ్ చేస్తుందని......నన్ను ఏ విషయంలోనైనా ఇట్టే కన్విన్స్ చేస్తుందని నాగబాబు గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

సెంటరాఫ్ అట్రాక్షన్

సెంటరాఫ్ అట్రాక్షన్

నిహారిక ఈ మధ్య ఏ కార్యక్రమానికి హాజరైనా సెంటరాఫ్ అట్రాక్షన్‌గా మారుతోంది. ఆమె సినిమాల్లోకి వస్తుందనే ప్రచారం కూడా ఇందుకు ఓ కారణం కావొచ్చు. మెగా ఫ్యామిలీ హీరోయిన్ అంటే ఆ మాత్రం ఉండటం కామనే...

నిహారికపై నమ్మకం!

నిహారికపై నమ్మకం!

మెగా బ్రదర్ నాగబాబుకు తన కొడుకు వరుణ్ తేజ్ కన్నా...కూతురు నిహారికపైనే నమ్మకం ఎక్కువ అట. ఎందుకంటే వరుణ్ తేజ్ కన్నా, నిహారికనే చాలా ఇంటలిజెంట్ అంటున్నారు నాగ బాబు.

చాలా చురుకు!

చాలా చురుకు!

నిహారిక చిన్నప్పటి నుంచి చాలా చురుకైన అమ్మాయి. అందరితో త్వరగా కలిసిపోయే తత్వం, ఏ పనయినా పర్ ఫెక్టుగా చేసే గుణం. వెరసి మెగా ఫ్యామిలీ అమ్మాయిల్లో నిహారికే బెస్ట్ అనే టాక్ మెగా ఫ్యామిలీ సన్నిహితుల నుంచి వినిపిస్తోంది.

పవన్ బాబాయ్, చరణ్ అన్నయ్యతో..

పవన్ బాబాయ్, చరణ్ అన్నయ్యతో..

పెదనాన్న చిరంజీవి అంటే నిహారిక భక్తితో పాటు కాస్త భయం కూడా ఉందట. అయితే బాబాయ్ పవన్ కళ్యాణ్ మరియు అన్నయ్య చరణ్‌తో ఆమె చాలా క్లోజ్ గా ఉంటుందని ఈ ఫోటో చూస్తే స్పష్టం అవుతోంది.

అల్లు అర్జున్

అల్లు అర్జున్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో నిహారిక చాలా సన్నిహితంగా ఉంటుంది. ఇక్కడున్న ఫోటో పరిశీలిస్తే నిహారిక, అల్లు అర్జున్ మధ్య ఉన్న స్నేహ పూర్వక బంధాన్ని అర్థం చేసుకోవచ్చు.

వరుణ్ తేజతో..

వరుణ్ తేజతో..

ఇంట్లో వరుణ్ తేజ కంటే నిహారిక చాలా అల్లరి చేస్తుంట. ఈ విషయాన్ని నాగబాబు ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. కొన్ని విషయాలు నాన్న ముందు ధైర్యంగా డీల్ చేయడానికి వరుణ్ భయపడతాడట. అలాంటపుడు నిహారిక హెల్ప్ తీసుకుని నాన్నను కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తాడట వరుణ్.

నాగబాబు ముద్దుల కూతురు

నాగబాబు ముద్దుల కూతురు

నాగబాబుకు నిహారిక ముద్దుల కూతురుగా చెప్పుకోవచ్చు. నిహారికను నాగబాబు ఎంతో గారాబంగా పెంచారు. అన్ని విషయాల్లోనూ ఆమెకు పూర్తి స్వేచ్చనిచ్చారు. తన కూతురును చూసి నేను ఎంతో గర్వ పడతాను అని నాగబాబు చెప్పుకుంటున్నారంటే నిహారిక గురించి అర్థం చేసుకోవచ్చు.

అఖిల్‌తో

అఖిల్‌తో

అఖిల్ తో కలిసి నిహారిక ఓ షార్ట్ ఫిల్మ్‌లో నటిస్తోంది. వీలైతే ఇద్దరూ త్వరలో సినిమా హీరో హీరోయిన్లుగా నటించే అవకాశం ఉంది. గతంలో అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు సుప్రియ, పవన్ కళ్యాణ్ హీరోగా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. ఇపుడు నిహారిక-అఖిల్ కలిసి నటించబోతున్నారనే వార్త చర్చనీయాంశం అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X