కొంటె కుర్రాళ్ళు దాదాపు పూర్తి
కొంటె కుర్రాళ్ళు చిత్రం షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. నిర్మాత పి. కాశీ ఈ విషయాన్ని చెబుతూ "ముగ్గురు కుర్రాళ్ళు, ఓ ఇంటి ఓనర్‌కు మధ్య సాగే సరదా కథ ఇది. ఎడిటింగ్, డబ్బింగ్ కార్యక్రమాలు ఇప్పటికే పూర్తయిపోయాయి. మరో వారంలో రీ-రికార్డింగ్‌ను ప్రారంభిస్తాం అని అన్నారు. త్వరలో ఆడియోను ఆడియోను, నెలాఖరుకు సినిమాను విడుదల చేయబోతున్నామని సమర్పకులు మారం శ్రీనివాసరావు తెలిపారు. నారాయణ క్రియేషన్స్ పతాకంపై శివాజీ దర్శకత్వంలో పి.సెల్వరాజ్ నిర్మాణ సారథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. ధర్మవరపు సుబ్రమణ్యం, బ్రహ్మానందం, జ్యోతి, సంతోష్ పవన్, విజయసాయి, జహీర్‌ఖాన్, సూర్య, కృష్ణభగవాన్, కొండవలస, మాస్టర్ విజయ్, కాశి, హేమ, లహరి ప్రధాన పాత్రల్ని పోషించారు.


Click it and Unblock the Notifications











