కొరటాల, హరీష్ శంకర్, అలీ, నికిల్ విరాళం
హైదరాబాద్: హుధూద్ తుఫాన్ బాధితులను ఆదుకునేందుకు మరికొందరు తెలుగు సినీ ప్రముఖులు ముందుకు వచ్చారు. దర్శకుడు కొరటాల శివ, హరీష్ శంకర్, అలీ, నిఖిల్ తదితరులు విరాళం అందించారు. కొరటాల శివ రూ. 3.5 లక్షలు(2 లక్షలు రామకృష్ణ మిషన్ కోసం, 1.5 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్), హరీష్ శంకర్ 3 లక్షలు, అలీ రూ. 1 లక్ష విరాళంగా ప్రకటించారు. యువ హీరో నిఖిల్ రూ. 2 లక్షల విరాళం ప్రకటించారు.
దీంతో పాటు ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ తరుపున హుధూద్ తుఫాన్ బాధితుల కోసం రూ. 10 లక్షలు విరాళం ప్రకటించారు. ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి 100 టన్నుల బియ్యం(లక్ష కేజీలు) పంపిణీ చేయడానికి ముందుకు వచ్చారు. దీంతో పాటు పిచ్చెక్కిస్తా చిత్ర యూనిట్ హుధూద్ తుఫాన్ బాధితుల కోసం రూ. 25 వేల రూపాయల విరాళం ప్రకటించారు.

ఇక టాలీవుడ్ స్టార్ హీరోలైన పవన్ కళ్యాణ్ 50 లక్షలు, సూర్య కుటుంబం 50 లక్షలు, రామానాయుడు ఫ్యామిలీ 50 లక్షలు, కృష్ణ మహేష్ బాబు ఫ్యామిలీ రూ. 50 లక్షలు, బాలయ్య 30 లక్షలు, ప్రభాస్ 20 లక్షలు, అల్లు అర్జున్ 20 లక్షలు, రేణు దేశాయ్ 20 లక్షలు, ఎన్టీఆర్ 20 లక్షలు, నాగార్జున రూ. 20 లక్షలు, రవితేజ, నితిన్, రామ్ తలొక 10 లక్షలు, దర్శకుడు త్రివిక్రమ్ రూ. 10 లక్షలు, వివి వినాయక్ రూ. 10 లక్షలు, కళ్యాణ్ రామ్ రూ. 10 లక్షల, బోయపాటి శ్రీను రూ. 7 లక్షలు, శ్రీను వైట్ల రూ. 5 లక్షలు, యాక్టర్ సునీల్ రూ. 5 లక్షల విరాళం ప్రకటించారు, అల్లరి నరేష్ (5 లక్షలు), ప్రకాష్ రాజ్ (5 లక్షలు), బ్రహ్మానందం(3 లక్షలు), సందీప్ కిషన్(రూ. 2.5 లక్షలు), సంపూర్ణేష్ బాబు(1 లక్ష), గోపీచంద్ మలినేని(1 లక్ష), రాకుల్ ప్రీత్ సింగ్(1 లక్ష), నందు(1లక్ష), కోన వెంకట్ (1లక్ష) విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











