నీరు కార్చేసారు: మహేష్ బాబుపై న్యూస్ రూమరేనట
హైదరాబాద్ : మహేష్ లాంటి సూపర్ స్టార్ సినిమాలు గురించిన వార్తలు ఎప్పుడూ మీడియాలో, అభిమానుల్లో ఎప్పుడూ నలుగుతూనే ఉంటాయి. అయితే వాటిల్లో ఎక్కువ శాతం రూమర్స్ ఉండే అవకాసం ఉంది. తాజాగా ఆయన కొరటాల శివ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం గురించి ఓన్యూస్ ప్రచారచంలోకి వచ్చింది. ఈ చిత్రంలో మహేష్ బాబు ద్విపాత్రాభినయం చేస్తున్నాడని ఆ వార్త. మీడియాలో,సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో ఈ వార్త బాగా పాపులర్ అయ్యింది. అయితే అది కేవలం రూమరే నని దర్శకుడు కొరటాల శివ తేల్చేసారు. ట్విట్టర్ ద్వారా ఆయన ఈ విషయమై అలాంటిదేమీ లేదని చెప్పారు.
మహేష్ బాబు ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 15 సంవత్సరాలు అవుతోంది. ఇన్నాళ్లూ మహేష్ ఎన్నో డిఫెరెంట్ పాత్రలలో కనిపించి తనను తాను ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నారు. భారతదేశంలోనే వెర్శటైల్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్నాడు. అయితే మహేష్ ఇన్నాళ్లూ ద్విపాత్రాభినయం ఎప్పుడూ చేయలేదు. తొలిసారిగా ఆయన డ్యూయిల్ రోల్ లో కనిపించనున్నారనటంతో అభిమానుల్లో ఆనందం మొదలైంది. అయితే ఇప్పుడులా ఈ వార్త ముగిసింది. సెప్టెంబర్ నుంచి ఈ చిత్రం ప్రారంభం కానుంది.

దూకుడుమీదున్నాడు మహేష్‌బాబు. 'ఆగడు' సెట్స్‌పై ఉండగానే కొత్త సినిమా కొబ్బరికాయ కొట్టేశారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ కొత్త చిత్రం మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై రూపొందుతోంది. శ్రుతిహాసన్ హీరోయిన్. ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సి.వి.మోహన్ నిర్మిస్తున్నారు. ఈ మధ్యనే హైదరాబాద్‌లో అట్టహాసంగా ప్రారంభమైంది.
''అందరినీ అలరించేలా ఉంటుందీ చిత్రం. మహేష్ నుంచి ప్రేక్షకులు ఏమేం కోరుకుంటారో అన్నీ ఇందులో ఉంటాయి'' అని దర్శకుడు చెప్తున్నారు. చిత్రంలో రాజేంద్రప్రసాద్, జగపతిబాబు, బ్రహ్మానందం, ముఖేష్ రుషి, సంపత్‌రాజ్, సుబ్బరాజు, తులసి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. చిత్రానికి కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, కళ: ఎ.ఎస్.ప్రకాష్, ఛాయాగ్రహణం: మధి, సంగీతం: దేవిశ్రీప్రసాద్.


Click it and Unblock the Notifications











