నాలుగేళ్లలో నాకు రెండు సార్లు లైఫ్ ఇచ్చారు: మహేష్ బాబు
మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'భరత్ అనే నేను' చిత్రం తొలి వారం రూ. 161 కోట్లకుపైగా వసూలు చేసి బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ నోవాటెల్‌లో బ్లాక్ బస్టర్ భారీ వేడక నిర్వహించారు. ఈ సందర్భంగా మహేష్ బాబు స్పీచ్ అదరగొట్టారు.
నాన్నగారి అభిమానులు అందరూ నన్ను సూపర్ స్టార్ సూపర్ స్టార్ అంటూ ఉంటారు. ఆ సూపర్ స్టార్‌కు నాలుగేళ్లలో రెండు సార్లు లైఫ్ ఇచ్చారు శివగారు. మీకు ఎప్పుడూ రుణపడి ఉంటాను సార్. ఆయనకున్న నాలెడ్జ్ గురించి, ఆయనకు తెలిసిన విషయాల గురించి నేను చెప్పలేను మహేష్ బాబు అన్నారు.

శివగారు నాలుగు సినిమాలు చేశారు...నాలుగు బ్లాక్ బస్టర్స్. ఎక్స్‌ట్రార్డినరీగా కథ చెబుతారు. ఇవి కాకుండా అతడికి చాలా విషయాలు తెలుసు. వచ్చాడయ్యో సామీ పాటలో అందరినీ చూసి దండం పెట్టే సీన్ చేసేపుడు నేను మామూలుగా దండం పెట్టాను. ఆయన వచ్చి దండం గుండెలపైన ఉండాలి అని చెప్పారు. ఇలా ప్రతి విషయంలో చాలా కేర్ తీసుకున్నారు.... అని మహేష్ బాబు గుర్తు చేసుకున్నారు.
ఈ సినిమాను ఆదరించి నాన్నగారి అభిమానులకు, నా అభిమానులకు ధన్యవాదాలు. మీ అందరూ మాకు ఇచ్చిన ఈ విజయం ఎప్పటికీ మరిచిపోలేను. ఇలాగే శ్రద్ధతో అంత:కరణ శుద్ధితో సినిమాలు చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.... అని మహేష్ బాబు వ్యాఖ్యానించారు.


Click it and Unblock the Notifications











