twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలకృష్ణ "సింహ" అసలు రచయిత ఎవరు?? కొరటాలని బండ బూతులు తిట్టిన పోసాని

    |

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో కేవలం డబ్బు మీదే నడిచి పోయే కొన్ని వ్యవహారాలుంటాయి. కథ,స్క్రీన్ ప్లే, మాటలూ ఇలా అన్నిటికిందా కనిపించే పేరు నిజానికి అసలైన రచయితది కాక పోవచ్చు. డబ్బులకోసం ఆ మతలూ, కథా రాసిచ్చిన రచయిత ఇండస్ట్రీలోనే ఇంకా అవకాశాల కోసం తిరుగుతూ ఉండవచ్చు. కథ వింటాం అని కొత్త రచయితలను ఒఇలిచి తీరా విన్నాక....

    తర్వాత చూద్దాం అని అతన్ని పంపించేసి అదే కథని కాపీ కొట్టే సంధర్బాలూ చాలానే ఉంటాయి. ఈ సందర్భం లో అయితే కనీసం రచయితకి ఆ డబ్బులు కూడా అందవు. రచయైతగా తనకూ ఇలాంటి అనుభవాలున్నట్టు ఈ మధ్యే ఒక పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. దర్శకుడు కొరటాల... అయితే కేవలం పోసాని దగ్గర మాత్రం అతనకు అలాంటి అనుభవం ఎదురు కాలేదట. ఆయన చెప్పిన మాటలు... కొన్ని నమ్మలేని నిజాలు.... స్లైడ్ షోలో...

    కథ అయిపోతే అంతే

    కథ అయిపోతే అంతే

    ‘‘రైటర్‌గా ఉన్నపుడు ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. లక్కీగా పోసాని కృష్ణమురళి దగ్గర జరగలేదు. కొన్ని సినిమాలకు మొత్తం పనిచేసినా టైటిల్స్‌లో క్రెడిట్ ఇవ్వకపోయే వాళ్లు. ఒకసారి కథ ఫైనల్‌ అయిపోతే ఇక రచయితలు గుర్తుకురారు.

    డిస్టర్బ్ అయ్యేవాడిని

    డిస్టర్బ్ అయ్యేవాడిని

    దర్శకుడు, నిర్మాత రచయితతో మాట్లాడరు. ఆడియో వేడుకల్లో వారి గురించి ప్రస్తావించరు. ఇదంతా చూసి డిస్టర్బ్ అయ్యేవాడిని. నేను దర్శకుడిగా మారడానికి ఇవన్నీ కారణమే. ఓపెన్‌గా నా కథ తీసుకుందామని చూస్తుంటే నేనేమీ ఫీలయ్యే వాణ్ణికాదు.

    కెరీర్లో రెండు సినిమాలకు మాత్రమే

    కెరీర్లో రెండు సినిమాలకు మాత్రమే

    ఈ కథపోతే నేను బోలెడు కథలు రాయగలను అనే కాన్ఫిడెన్స్‌ ఉండేది'' అని , రచయితగా ఉన్నపుడు పారితోషకం చాలా తక్కువగా ఉండేదని.. తన కెరీర్లో రెండు సినిమాలకు మాత్రమే రచయితగా రూ.10 లక్షల చొప్పున అందుకున్నానని కొరటాల చెప్పాడు.

    ‘సింహా’ కథ మీదేనా?

    ‘సింహా’ కథ మీదేనా?

    ఈ సందర్భంగా ‘సింహా' కథ మీదేనా అన్న ప్రశ్నకు సూటిగా సమాధానం ఇవ్వని కొరటాల.. అదే నిజం అన్న తరహాలో నర్మగర్భంగా మాట్లాడాడు. ‘‘చాలా అనుభవాల్లో అదొకటి. కథ-మాటలు క్రెడిట్ వేయడం ఒకరకం.. మనకు కోపం వచ్చి అది కూడా వద్దులే అంటే వాళ్లు హర్ట్‌ అవ్వాల్సింది పోయి హమ్మయ్య అని అది కూడా తీసేసుకోవడం జరిగింది'' అన్నాడు కొరటాల. ఈ మాటల్ని బట్టే ‘సింహా' కథ, మాటలు కొరటాలవే అనుకోవాలా?

    పోసాని బూతులు తిట్టాడూ

    పోసాని బూతులు తిట్టాడూ

    కొరటాలను పోసాని బూతులు తిట్టిన మాట వాస్తవమే. కానీ అదేమీ కొపం తో తిట్టటం కాదుతో కాదు.. మంచి కోసమే. కొరటాల రచయితగా పని చేస్తున్న రోజులకు సంబంధించిన అనుభవం ఇది.

    బావా, బావమరుదులే

    బావా, బావమరుదులే

    కొరటాలకు పోసాని మేనత్త కొడుకే. ఆయన దగ్గర ముందు నుంచి చనువుందట. బీటెక్ పూర్తి చేశాక పోసాని దగ్గర అసిస్టెంటుగా చేరిన కొరటాల.. ఆయన దగ్గరే చాన్నాళ్లు పని చేశాడు.

    గది క్లీన్ గా లేదని

    గది క్లీన్ గా లేదని

    ఐతే ఓ సందర్భంలో అపరిశుభ్రమైన గదిలో పని చేస్తున్నందుకు పోసాని బూతులు తిట్టాడని కొరటాల చెప్పాడు. రచయిత ఉండే గది చెత్తా చెదారం తో మురికిగా ఉండటం పోసానికి నచ్చదట.

    కోపంతో బూతులే ఇంక

    కోపంతో బూతులే ఇంక

    ఓ సినిమా కోసం లక్డీకపూల్‌లోని ఒక హోటల్లో బీవీఎస్ రవి, ఇంకొందరితో కలిసి కొరటాల కొన్ని సన్నివేశాలు రాస్తున్నాడట. ఐతే ఉన్నట్లుండి ఆ గదికి వెళ్లిన పోసాని.. గదంతా చిందరవందరగా.. అపరిశుభ్రంగా ఉండటం చూసి చాలా కోపం తెచ్చుకున్నాడట.

    దర్శక నిర్మాతలని కూడా

    దర్శక నిర్మాతలని కూడా

    కొరటాల సహా అందరి మీదా బూతుల వర్షం కురిపించాడట. వాళ్లందరినీ అక్కడినుంచి తన ఆఫీస్‌కు తీసుకెళ్లి ఆ సినిమా దర్శక నిర్మాతల్ని కూడా పిలిపించి క్లాస్ పీకాడట.

    ప్రశాంతంగా ఉండాలి

    ప్రశాంతంగా ఉండాలి

    కథ ప్రధానంగా నడిచే సినిమాకు సన్నివేశాలు రాయాలంటే ఎంతో ప్రశాంతమైన వాతావరణం ఉండాలన్నది పోసాని ఉద్దేశమని.. అందుకే ఆయన అంతగా కోప్పడ్డారని కొరటాల వివరించాడు.

    పోసాని బాగ చూసుకునేవాడు

    పోసాని బాగ చూసుకునేవాడు

    తమకు వెంటనే గ్రీన్ పార్క్ హోటల్లో గది బుక్ చేయించి.. అక్కడికి పంపించినట్లు వెల్లడించాడు కొరటాల. అసిస్టెంట్ రైటర్లయిన తమ అందరినీ పోసాని చాలా బాగా చూసుకునేవాడని.. 1998 రోజుల్లోనే నెలకు పాతిక వేలు ఇచ్చేవాడని పోసానిని పొగిడాడు కొరటాల.

    English summary
    Director Koratala shiva shared so many things in a interview... some thing interesting in it
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X