‘ఆచార్య’ గురించి ఆయనకు చెప్పాను.. అలా మహేష్ బాబు పేరు లీకైంది.. గుట్టు విప్పిన కొరటాల
మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కబోతోన్న ఆచార్యపై ఎంతటి అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే సినిమా టైటిల్‌ను ఎంతో అట్టహాసంగా ప్రకటిద్దిమాని అంతా భావించినా.. చిరు ఉత్సాహం అవన్నీ నీరుగారిపోయాయి. ఓ ఈవెంట్‌లో పాల్గొన్న చిరు.. కొరటాలతో చేయబోయే సినిమా పేరు ఆచార్య అని లీక్ చేసేశాడు.

నిత్యం వార్తల్లోనే..
ఆచార్య సినిమాను ఏ ముహూర్తాన ప్రారంభించారో గానీ నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. మొదటగా ఓ ఫ్యాన్ మేడ్ పోస్టర్ హల్చల్ చేసింది, టైటిల్ ఇదే నంటూ వార్తలు చక్కర్లు కొట్టింది. అవన్నీ ఫేక్ అని స్వయంగా నిర్మాణ సంస్థ రంగంలోకి దిగి క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది.

త్రిషపై వార్తలు..
చిరుకు జోడిగా హీరోయిన్ ఎవరన్నది అధికారికంగా ప్రకటించలేదు. కానీ త్రిష మాత్రం తాను చిరు సినిమా నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే సినిమాను బయటకు వెళ్లడానికి త్రిష చెప్పిన కారణాలు, చిరు వివరణలకు పొంతన లేకుండా పోయింది.

మహేష్ నటిస్తున్నాడంటూ..
ఆచార్య సినిమాలో ఓ ముఖ్య పాత్ర ఉందని అది రామ్ చరణ్ చేస్తున్నాడని ఆ మధ్య వార్తలు వచ్చాయి. కొన్ని రోజుల తరువాత ఆ పాత్రను మహేష్ బాబు పోషిస్తున్నాడంటూ, పారితోషికంగా ముప్పై రోజులు ముప్పై కోట్లు అని కూడా వార్తలు వచ్చాయి. అయితే అలాంటిదేమీ లేదని, అసలు మహేష్ పేరు ఎలా వచ్చిందో తెలియడం లేదని చిరంజీవి చెప్పుకొచ్చాడు.

గుట్టు విప్పిన కొరటాల..
మహేష్ బాబు పాత్ర తెరపైకి రావడం గురించి కొరటాల మాట్లాడుతూ.. ‘ఆచార్య'లో బాధ్యత కలిగిన ఒక యువకుడి పాత్ర కోసం చరణ్ ను అనుకుంటున్నట్టుగా చిరంజీవితో చెబితే ఆయన ఓకే అన్నారు. తన పాత్ర గురించి చెబితే చరణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే 'ఆర్ ఆర్ ఆర్' ప్లానింగ్ లో మార్పు కారణంగా, చరణ్ డేట్స్ విషయంలో నాకు టెన్షన్ మొదలైంద'ని చెప్పుకొచ్చాడు.
Recommended Video

అలా మహేష్ పేరు తెరపైకి..
‘అదే విషయాన్నీ మాటల సందర్భంలో నేను మహేశ్ బాబుతో అంటే, 'నేను వున్నాను గదా .. టెన్షన్ పడకండి' అన్నారాయన. అంత పెద్ద స్టార్ అలా అండగా మాట్లాడిన విషయాన్ని నేను కొంతమందితో షేర్ చేసుకున్నాను. దాంతో 'ఆచార్య'లో మహేశ్ చేస్తున్నాడనే టాక్ బయటికి వెళ్లి, అది పెద్ద ప్రచారంగా మారింద'ని అసలు సంగతి బయట పెట్టేశాడు.


Click it and Unblock the Notifications











