twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'భరత్ అనే నేను' పవన్ కళ్యాణ్‌కైతే ఎలా ఉండేది.. కొరటాల సమాధానం, రంగస్థలంతో పోలిక!

    |

    Recommended Video

    'Bharath Ane Nenu' పవన్ కళ్యాణ్ అయితే ???

    భరత్ అనే నేను చిత్రం విడుదలై కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ఈ చిత్రం అతిపెద్ద విజయం దిశగా దూసుకుపోతోంది. సూపర్ స్టైలిష్ గా కనిపిస్తున్న మహేష్ ని ముఖ్యమంత్రి పాత్రలో చూసుకుంటూ అభిమానులు మురిసిపోతున్నారు. మహేష్ బాబు నటన, కొరటాల శివ దర్శకత్వ ప్రతిభ ఈ చిత్ర విజయానికి కారణంగా మారాయి.

    రాజకీయ నేపథ్యం ఉన్న కథ కావడంతో అభిమానులంతా ఈ చిత్రానికి కనెక్ట్ అయిపోయారు. ముఖ్యంగా ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాల్లో మహేష్ కనబరచిన నటన అద్భుతమనే చెప్పాలి. తాజగా జరిగిన ఇంటర్వ్యూలో కొరటాల శివ భరత్ అనే నేను చిత్రం గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

    పవన్ కళ్యాణ్ అయితే ఎలా ఉండేది

    పవన్ కళ్యాణ్ అయితే ఎలా ఉండేది

    భరత్ అనే నేను చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ పవన్ అభిమానుల మధ్య చర్చని యాంకర్ దర్శకుడు కొరటాల మధ్య ఉంచారు. భరత్ అనే నేను చిత్రం పవన్ కళ్యాణ్ కైతే బావుండేదనే అభిప్రాయాన్ని అయన అభిమానులు వ్యక్తపరుస్తున్నారని యాంకర్ ప్రశించడంతో కొరటాల సంధానం ఇచ్చారు. అభిమానులు కోరుకోవడంలో తప్పేముంది అని కొరటాల అన్నారు.

    న్యూట్రల్‌గా ఉండే వ్యక్తి

    న్యూట్రల్‌గా ఉండే వ్యక్తి

    భరత్ అనే నేను చిత్ర కథ సిద్ధం చేసుకున్నప్పుడు తాను మహేష్ ని తప్ప మరెవరిని ఊహించుకోలేదని అన్నారు. మహేష్ బాబు రాజకీయాలు పట్టించుకోరని ఆయన అన్నారు. ఈ కథకు న్యూట్రల్ గా ఉండే హీరో కావాలని భావించామని అది మహేష్ బాబే అని కొరటాల అన్నారు.

     రంగస్థలం చిత్రంతో పోలిక

    రంగస్థలం చిత్రంతో పోలిక

    రంగస్థలం, భరత్ అనే నేను రెండు చిత్రాలు రాజకీయ నేపథ్యంతో వరుసగా విడుదల అయ్యాయి. ఈ వాదనని కొరటాల ఖండించారు. రంగస్థలం చిత్రం రాజకీయ నేపథ్యం ఉన్న కథ కాదని అన్నారు. ఆ చిత్రం ఒక గ్రామంలో చోటు చేసుకున్న సంఘటనల సమాహారం అని అభిప్రాయపడ్డారు.

    ప్రతి చిత్రంలోనూ రాజకీయం

    ప్రతి చిత్రంలోనూ రాజకీయం

    ఇప్పుడు వస్తున్న ప్రతి చిత్రంలోనూ విలన్ రూపంలోనో, మంత్రి రూపంలోనో రాజకీయానికి సంబంధించిన అంశం ఉంటుంది. అలా అని ప్రతి చిత్రాన్ని పొలిటికల్ మూవీ అనలేమని కొరటాల అన్నారు.

     10 సినిమాలు మాత్రమే

    10 సినిమాలు మాత్రమే

    తాను కేవలం 10 చిత్రాలు మాత్రమే చేసి ఆ తరువాత దర్శకత్వం ఆపేస్తానని కొరటాల అన్నారు. ప్రతి చిత్రం చేసే సమయంలో తనకు చాలా ఒత్తిడి ఉంటుందని కొరటాల అన్నారు.

    English summary
    Koratala Siva about Pawan Kalyan. There is no comparison between Rangasthalam and Bharat ane nenu says Koratala
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X