మైత్రీ మూవీస్ కేంద్రంగా రచ్చ.. కథ నాదే అంటోన్న రచయిత.. కాదంటోన్న కొరటాల శివ

ఆచార్య సినిమాపై వివాదం మొదలైంది. ఆ సినిమా కథ తనదేనని యువ రచయిత రాజేష్ అని వ్యక్తి ఆరోపణలు చేస్తున్నాడు. తన కథను మైత్రీ మూవీస్‌కి వినిపించానని, ఆ కథనే కొరటాల శివ ఆచార్య సినిమాగా చిత్రీకరిస్తున్నారని రాజేష్ ఆరోపణలు చేస్తున్నాడు. ఈ మేరకు గత రెండు మూడు రోజులుగా యూట్యూబ్ చానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఇక రాజేష్ చేసే కామెంట్స్ చినికి చినికి గాలి వానగా మారుతున్న క్రమంలో కొరటాల శివ స్పందించాడు. తాజాగా మీడియాకు లైవ్ ఇంటర్వ్యూ ఇచ్చిన క్రమంలో రాజేష్‌ ప్రశ్నలకు కొరటాల సమాధానం ఇచ్చాడు.

మైత్రీ మూవీస్ కేంద్రంగా..

మైత్రీ మూవీస్ కేంద్రంగా..

మైత్రీ మూవీస్‌కి కథ చెప్పాను. బాగుందని అన్నారు. అయితే ఇంత పెద్ద కథ, మొదటి సినిమా.. నిన్ను నమ్మి ఇంత బడ్జెట్ ఎలా పెట్టాలి.. ఇది కొరటాల శివ లాంటి పెద్ద దర్శకులు అయితే హ్యాండిల్ చేస్తారు అని అన్నట్టు రాజేష్ తెలిపాడు. అదే కథను ఇప్పుడు కొరటాల శివ తీస్తున్నారని ఆరోపించాడు.

నా కథ అదే..

నా కథ అదే..

జీవితంలో నాకు ఎదురైన అనుభవాలతో కథ రాసుకున్నాను. అన్యాక్రాంతమైన దేవుడి మాన్యాలు, వాటిపై పోరాడే ఓ వ్యక్తి.. డ్యూయర్ రోల్.. 1990 ఫ్లాష్ బ్యాక్.. తండ్రి చనిపోతే కొడుకు పోరాటం చేస్తాడు. ఇదే నా స్టోరీ అంటూ మీడియా ముఖంగా రాజేష్ వివరించాడు. ఈ కథను మొదటగా తన ఊరు ఎమ్మెల్యే గొట్టిపాటి రవికి వినిపించానని, ఆయన ద్వారా మైత్రీ మూవీస్ వారిని కలిశానని తెలిపాడు.

అది ఆచార్య కథ కాదు..

అది ఆచార్య కథ కాదు..

రాజేష్ చెప్పిన కథను విన్న కొరటాల శివ స్పందించాడు. అది ఆచార్య కథ కాదని ఆన్ రికార్డ్ చెబుతున్నా అని కొరటాల శివ క్లారిటీ ఇచ్చాడు. ఈ కథను ఎప్పుడో రిజిష్టర్ చేయించాను. ఇప్పుడు కథలో మార్పులు చేయడం కుదరదు. మీరు చెప్పిన కథ ఆచార్యలో లేదు అంటూ స్పష్టంగా చెప్పాడు.

చిరంజీవి దగ్గరికి..

చిరంజీవి దగ్గరికి..

డైరెక్టర్ అసోసియేషన్, రైటర్స్ అసోసియేషన్‌లో అతనికి న్యాయం జరగడం లేదని చెప్పాడు. ఈ విషయాన్ని చిరంజీవి దృష్టికి నేనే తీసుకెళ్తాను అని కొరటాల శివ అన్నారు. అయితే పదే పదే ఇలా నాపై ఆరోపణలు చేస్తే, ఆచార్య కాపీ అంటే నేను కోర్టుకు వెళ్తాను . కేసు వేస్తాను అంటూ కొరటాల ఫైర్ అయ్యాడు.

స్పందించిన యూనిట్..

స్పందించిన యూనిట్..

ఆచార్య కథ మాదే అంటూ కొందరు చేస్తున్న వివాదాస్పద ప్రకటనలకు క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రకటన జారీ చేస్తున్నామంటూ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ తెలిపింది. ఆచార్య కథ ముమ్మాటికి మాదేనంటూ... కొరటాల శివ రూపొందించిన ఒరిజినల్ కథ. ఎవరి కథను కాపీ కొట్టలేదని క్లారిటీ ఇచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X