ఏడాది కాలంగా ఇదీ ఓ అగ్ర దర్శకుడి పరిస్థితి! కారణం రామ్ చరణే..

Recommended Video

Chiranjeevi And Koratala Siva's Up Coming Movie Delay Because of Ram Charan?? | Filmibeat Telugu

ప్రతిభ అనేది నిరంతరం మనిషిలోని గ్రేట్ నెస్‌కి చిహ్నంగా ఉంటుంది తప్ప.. దాన్ని నిరూపించుకోవడానికి అన్నిసార్లు టైమ్ కలిసి రాదు. అందుకే టైమొచ్చినప్పుడే తమ లోని ప్రతిభకు మరింత పదును పెట్టి చాటుకోవాలని ప్రయత్నిస్తుంటారంతా. ముఖ్యంగా సినిమా వాళ్ళైతే ఇదే ఫాలో అవుతారు. కేవలం నటీ నటులే కాదు దర్శక నిర్మాతలకు కూడా ఇందుకు అతీతులు కాదు. ఈ నేపథ్యంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కారణంగా టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ పరిస్థితి కుడిదిలో పడిన ఎలుకలా తయారైందట. ఆ విశేషాలేంటో చూద్దామా మరి..

 వరుస సినిమాలు.. అన్నీ బ్లాక్‌బస్టర్స్

వరుస సినిమాలు.. అన్నీ బ్లాక్‌బస్టర్స్

నేటితరం టాలెంటెడ్ డైరెక్టర్లలో ఒకరైన కొరటాల శివ వరుస సినిమాలు చేస్తూ వాటన్నింటినీ ఇండస్ట్రీ బ్లాక్‌బస్టర్స్‌గా మలిచారు. ప్రభాస్ హీరోగా వచ్చిన మిర్చి సినిమా మొదలుకొని ఆయన దర్శకత్వంలో వచ్చిన శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను అన్నీ సూపర్ డూపర్ హిట్ సినిమాలే. దీంతో మెగాస్టార్ చిరంజీవి కన్ను కొరటాలపై పడింది.

వెంటనే చిరు అలా డిసైడ్ అయ్యారు

వెంటనే చిరు అలా డిసైడ్ అయ్యారు

సినిమాల్లోకి గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి తన సైరా నరసింహా రెడ్డి సినిమా పూర్తికాగానే కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారు. ఈ మేరకు ఆయనతో స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పేశారు కూడా. దీంతో ఆ పనిలో పడిన కొరటాల.. త్వర త్వరగా స్క్రిప్ట్ రెడీ చేసి చిరు కోసం వెయిటింగ్‌లో ఉన్నారట.

ఈ లోగా రామ్‌చరణ్ వచ్చి..

ఈ లోగా రామ్‌చరణ్ వచ్చి..

వాస్తవానికి కొరటాల శివ, చిరంజీవి కాంబోలో రానున్న సినిమా గతేడాది డిసెంబర్ లోనే మొదలు కావాల్సి ఉంది. కానీ ఈ లోగా రామ్ చరణ్ వచ్చి కొరటాలను కాస్త సమయం తీసుకుందామని సూచించారట. సైరా సినిమాను 2019 వేసవిలో రిలీజ్ చేసి వెంటనే సెట్స్ పైకి వెళదామని ఆయన చెప్పారట. కానీ తీరా చూస్తే 2019 వేసవి ముగిసింది. కానీ సైరా పూర్తికాలేదు. మెగా హీరోల కోసం కొరటాల ఎదురు చూపులు అలాగే మిగిలిపోయాయి.

పాపం కొరటాల పరిస్థితి ఇలా ఉంది

పాపం కొరటాల పరిస్థితి ఇలా ఉంది

తాను రూపొందిస్తున్న సినిమాలు వరుసగా విజయవంతం కావడంతో ఆనందంగా ఉన్న కొరటాలకు మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే అవకాశం రావడం మరింత ఉత్సాహాన్నిచ్చింది. ఎంత సమయమైనా వెయిట్ చేసి, తన ప్రతిభకు మరింత పదును పెట్టి చిరుతో కలిసి ఇండస్ట్రీ హిట్ కొట్టేయాలని భావించారు కొరటాల. కానీ ఆ ఎదురు చూపులకు ఏడాది గడిచినా ఇంకా మోక్షం కలగకపోవడం ఆయనకు నిరాశ కలిగించే అంశమే అని చెప్పుకోవచ్చు. కాగా చిరు, కొరటాల సినిమా ఆ ఆగస్టులో సెట్స్ పైకి రానుందనేది లేటెస్ట్ సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X