Koratala siva :ఈసారి మెసేజీలు లేవమ్మా.. 'మాస్ మసాలా'తో ఫ్యాన్స్ కు పూనకాలు
రాజమౌళితో RRR సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ సినిమా గురించి గతంలో అనేక రకాల ప్రచారం జరుగుతూ వచ్చాయి. కానీ తాజాగా ఆచార్య ప్రమోషన్స్ లో పాల్గొంటున్న కొరటాల శివ ఎన్టీఆర్ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో ఈ సినిమా గురించి వచ్చిన అనేక రూమర్లు మీద స్పందించిన ఆయన సినిమా ఎలా ఉండబోతోంది ఈ విషయం మీద కూడా క్లారిటీ ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే..

29వ తేదీన విడుదల
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, మెగాస్టార్ చిరంజీవి మొట్టమొదటి సారి కలిసి నటిస్తున్న చిత్రం ఆచార్య. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ పూజ హెగ్డే కీలక పాత్రలో నటించాడు కానీ కాజల్ అగర్వాల్ పాత్రను తర్వాత తొలగించారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ల మీద నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 29వ తేదీన విడుదల అవుతోంది.

ప్రమోషన్లలో
ఈ సినిమా విడుదల నేపథ్యంలో కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, పూజ హెగ్డే రకరకాల ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. అందులో భాగంగానే కొరటాల శివ తాజాగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా గురించి ఆయనను పలు రకాల ప్రశ్నలు సంధించారు మీడియా ప్రతినిధులు.

మెసేజ్ లు ఇవ్వడం లేదని
ఈ ప్రశ్నలన్నీ ఆసక్తిగా విన్న కొరటాల శివ ఈ సినిమా గురించి అసలు విషయం బయట పెట్టారు. అందరూ అనుకున్న విధంగా ఈ సినిమా పొలిటికల్ సినిమా కాదని, పొలిటికల్ సబ్జెక్ట్ అసలు ఏమాత్రం చేయడం లేదని చెప్పుకొచ్చారు. అదేవిధంగా తన ప్రతి సినిమాలో ఏదో ఒక విధమైన మెసేజ్ అంతర్లీనంగా ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటాను అని కానీ ఎన్టీఆర్ తో చేయబోతున్న సినిమా విషయంలో మాత్రం అలాంటి మెసేజ్ లు ఇవ్వడం లేదని అన్నారు.

కొరటాల శివతో సినిమా
పూర్తిస్థాయి మాస్ మసాలా యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రూపొందుతుందని కొరటాల శివ చెప్పుకొచ్చారు.. ఇక ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ వెలువడుతుందని బహుశా సినిమా అప్పటి నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని కూడా ఆయన వెల్లడించారు.. నిజానికి రాజమౌళితో సినిమా చేస్తున్న సమయంలోనే ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా సెట్ అయింది. అంతా ఓకే అనుకున్న సమయంలో మళ్లీ ఏమైందో ఏమో తెలియదు కానీ త్రివిక్రమ్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. ఎన్టీఆర్ కొరటాల శివతో సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు.

త్రివిక్రమ్ సినిమా ఆగిపోలేదని
ఇక అయితే త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమా కూడా ఆగిపోలేదని అది పాన్ ఇండియా సినిమా కావడంతో కొంచెం గ్యాప్ తీసుకుని సినిమా చేయాలని నిర్ణయించుకున్నామని గతంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత నిర్మాత నాగ వంశీ వెల్లడించారు.. ఇక తాజా కామెంట్స్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే గాల్లో తేలిపోతున్నారు. రాజమౌళి సినిమా తర్వాత కూడా కొరటాల శివ మరో సూపర్ హిట్ అందిస్తాడని వారంతా భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











