అసలు డైరెక్షన్ చేయలేదన్న కొరటాల.. నిజం కాదన్న చిరంజీవి.. ఏమైందంటే?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఆచార్య సినిమా అనేక వాయిదాల అనంతరం ఏప్రిల్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.. అయితే ఈ సినిమా మొదటి ఆట నుంచి కొంచెం మిశ్రమ స్పందన తెచ్చుకుంది. కొంతమంది సినిమా బాగుంది అని కొంతమంది సినిమా బాలేదు అని అంటున్నారు..

Recommended Video

Acharya Movie Story Based On A Great Book, Here Is the Details|Tollywood Updates|Filmibeat Telugu

అయితే కొరటాల శివ కెరీర్ లో మొట్టమొదటి ఫ్లాప్ ఇదే అంటూ కొంతమంది కామెంట్ చేయడమే కాక అసలు ఈ సినిమాలో కొరటాల శివ దర్శకత్వం చేయలేదంటూ చేసిన కామెంట్స్ ను ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. అసలు ఆయన ఏ సందర్భంగా ఈ కామెంట్స్ చేశారు, ఇప్పుడు దేని కోసం ఆ కామెంట్స్ ను వైరల్ చేస్తున్నారు అనే వివరాల్లోకి వెళితే

భారీ అంచనాలతో

భారీ అంచనాలతో

మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కలిసి నటించిన తాజా చిత్రం ఆచార్య. ఇప్పటికే అనేక సార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ ల మీద నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో పూజా హెగ్డే రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటించింది.

మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుందని ప్రచారం జరిగింది, అందుకు తగ్గట్టుగానే ఆమె కొన్ని సీన్స్ లో కూడా నటించింది. కానీ అనూహ్య పరిస్థితుల్లో ఆమెను పూర్తిగా సినిమా నుంచి తప్పించారు..

సోషల్ మీడియాలో వైరల్

సోషల్ మీడియాలో వైరల్

ఏప్రిల్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకుంది. అయితే సినిమా బాలేదు అని కొంతమంది కామెంట్ చేస్తుంటే, తండ్రి కొడుకులు కలిసి మొట్టమొదటిసారి నటిస్తున్నారు అంటే చాలా ఎక్స్పెక్ట్ చేశామని కానీ ఊహించినంతగా మాత్రం సినిమా లేదని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే కొరటాల శివ చేసిన కొన్ని కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అభిమానులు ఒత్తిడి కూడా

అభిమానులు ఒత్తిడి కూడా

ఆచార్య ప్రమోషన్ లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ, కొరటాల శివ కలిసి కొన్ని ఇంటర్వ్యూలు ఇవ్వగా కొరటాల శివ ఒకరే ఒక ఇంటర్వ్యూ మెగాస్టార్ చిరంజీవి యువ దర్శకులతో ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. అలాగే కొరటాల శివ చిరంజీవిలను కలిపి యాంకర్ భార్గవి ఇంటర్వ్యూ చేశారు. అందులో భాగంగా రామ్ చరణ్, చిరంజీవి ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తూ చూపించడం అనేది కత్తిమీద సాములాంటిది అని అభిమానులు ఒత్తిడి కూడా మీ మీద ఉంటుంది కదా అని కొరటాల శివను ప్రశ్నించారు.

ఆ సీన్లు చేసుకుంటూ

ఆ సీన్లు చేసుకుంటూ

అయితే దానికి కొరటాల శివ స్పందిస్తూ ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ అని ఎక్కడా కొలతలు వేసుకుని చేసిన సినిమా కాదిది. నిజానికి చిరంజీవి గారి సినిమాలో ఒక రకంగా రామ్ చరణ్ కు ఇది అతిథి పాత్ర అని చెప్పాలి కానీ కనిపించినంత సేపు రామ్ చరణ్ కూడా తనదైన శైలిలో ఆకట్టుకున్నారు.. సినిమాలో అత్యంత కష్టమైన విషయం ఏమిటంటే వీరిద్దరినీ కలిపి చూపించే సీన్లు. అయితే ఆ సీన్లు తీయాల్సిన సమయంలో నేను ఏమీ డైరెక్షన్ చేయలేదు నేను పూర్తిగా రిలాక్స్ అవుతుంటే మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆ సీన్లు చేసుకుంటూ వెళ్ళిపోయారు..

అది నిజం కాదన్న చిరు

అది నిజం కాదన్న చిరు

అక్కడ నేను పూర్తిగా డైరెక్టర్ గా రిలాక్స్ అయ్యాను అని కొరటాల శివ చెప్పుకొచ్చారు. అయితే మెగాస్టార్ చిరంజీవి కల్పించుకుని కొరటాల శివ చెప్పింది కరెక్ట్ కాదని కొరటాల శివకు ఏం కావాలో మేము అది డెలివరీ ఇవ్వడానికి ప్రయత్నం చేశామని సీన్ సీన్ కి ఆయనతో చెప్పించు కోకుండా పని చేశాం కాబట్టి ఆయన అలా రిలాక్స్ అయినట్లు ఫీల్ అవుతున్నారు అని చెప్పుకొచ్చారు. ఇక సినిమా రిజల్ట్ కాస్త తేడాగా పడడంతో ఈ వ్యాఖ్యలను తీసుకువచ్చి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు కొంత మంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X