దేవర పార్ట్ 2 లో భారీ ట్విస్ట్ దాచిన కొరటాల.. ఈ ప్రశ్నలకి సమాధానం ఎలా?
చాలా కాలం తర్వాత ఓ స్టార్ హీరో నుంచి అవైటెడ్ సినిమా ఇండియన్ సినిమా దగ్గర రిలీజ్ కి వచ్చింది. మరి ఆ హీరోనే యంగ్ టైగర్ నుంచి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గా మారిన జూనియర్ ఎన్టీఆర్ కాగా తన నుంచి దాదాపు ఐదేళ్ల తర్వాత వచ్చిన భారీ చిత్రమే "దేవర". కాగా ఘోరమైన ప్లాప్ ఆచార్య లాంటి డిజాస్టర్ చేసిన చేసిన దర్శకుడు కొరటాల శివతో చాలా డేరింగ్ గా చేసిన ఈ చిత్రం ఎన్టీఆర్ సహా రాజమౌళి సెంటిమెంట్స్ తో వచ్చి ఊహించని ఓపెనింగ్స్ అందుకుంది.
కాగా ఒక్క ఆరోజులోనే జరిగిన బిజినెస్ లో చాలా వరకు రాబట్టేసిన ఈ చిత్రానికి మరీ అనుకున్నంత గట్టి టాక్ అయితే ఆడియెన్స్ నుంచి రాలేదు. రాత్రి 1AM షోస్ నుంచే మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ దేవర భారీ ఓపెనింగ్స్ సాధించింది. అయితే ఈ సినిమా చూసాక చాలా మందిలో చాలా కంప్లైంట్స్ కనిపించాయి.

కానీ వాటిని మించిన ఎలిమెంట్స్ ని అయితే కొరటాల శివ పార్ట్ 2 కోసం దాచి ఉంచారని చెప్పాలి. కాగా ఎండింగ్ లో బాహుబలి లాంటి క్రేజీ ముగింపుని ఇవ్వడంతో తన కొడుకే దేవరని ఎందుకు చంపాడు అనేది మొదటి పెద్ద ప్రశ్న అయితే ఇది ఒక్కటే కాకుండా పార్ట్ 2 లో కొరటాల చాలా ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సి ఉంది. మొదటగా అసలు దేవరలో చూపించే సముద్రంలో కపాలాలతో కూడిన అస్థి పంజరాలు చూసి అజయ్ భయపడతాడు.
ఒక సీన్ లో వారిని శవాలు వీళ్ళు కాదని ప్రకాష్ రాజ్ చెబుతాడు. అంటే పార్ట్ 2 లో ఇంకా భయంకరంమైన యాక్షన్ దాగి ఉందని చెప్పాలి. అలాగే అది చేసింది దేవర కొడుకు వర కూడా అయ్యే ఛాన్స్ లేదు. ఆ అస్థి పంజరాలు అన్నీ ఎన్నో ఏళ్ళు కితం నాటివి అయితే తప్ప అలాంటి స్థితికి చేరుకోవు. సో ఇది ఖచ్చితంగా దేవర పని అయ్యి ఉంటుంది. అలాగే పార్ట్ 2 లో దేవర, వర ఇద్దరూ కలిసి కనిపించే ఛాన్స్ ఉంది.
ఇదే అందులో పెద్ద ట్విస్ట్ కావచ్చు. దేవర కనిపించకుండా వెళ్ళిపోయిన అన్నేళ్ల తర్వాత అక్కడ కుర్రాళ్ళకి బ్రతుకు మార్గం నేవిలో ఉద్యోగాలు అంటూ తెలుస్తుంది. ఇది కూడా దేవర బయట ఉంది చేయించిన పని కావచ్చని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అలాగే సినిమాలో అజయ్ వెతుకుతున్న "యెతి" ఎవరు? ఈ యెతి కి దేవరకి ఏమన్నా సంబంధం ఉందా అనేది కూడా ఆలోచించాలి.

చరిత్ర చూస్తే యెతి అనేది చాలా తక్కువ శాతం మనుషుల కంటికి కనిపిస్తుంది అని అంటారు. ఎన్నో ఏళ్ళు తరబడి భూమి మీదే ఉంది కానీ ఎవరికీ కనిపించదు. ఇక్కడ సీన్ కట్ చేస్తే దేవర కూడా కొన్నేళ్ల పాటు మాయం అవుతాడు. అప్పుడప్పుడు ఎవరో అక్కడ చూసాం ఇక్కడ చూసాం అని మాత్రం చెబుతారు.
సో ఆ కనిపించకుండా ఏదో చేస్తున్న యెతి దేవర ఎందుకు కాకూడదు? ఇలా చాలా ప్రశ్నలే పార్ట్ 2 లో కొరటాల చిక్కుముడి విప్పాల్సి ఉంది. మరి పార్ట్ 1 పెద్ద హిట్ అయితే తప్ప పార్ట్ 2 స్టార్ట్ అయ్యే స్కోప్ ఇప్పుడు లేదు. మరి చూడాలి పార్ట్ 1 విషయంలో ఏం జరుగుతుంది అనేది.


Click it and Unblock the Notifications











