ఆ డైరెక్టర్ ఓకే అయితే అఖిల్ మూడో సినిమా బ్లాక్ బాస్టర్ ఖాయం..కానీ!

Recommended Video

Akhil & Koratala Shiva Combines For Next Movie ఇది ఓకే అయితే అఖిల్ లక్కీ ...

అక్కినేని అభిమానుల్లో, సినీవర్గాల్లో భారీ అంచనాలతో అఖిల్ సినీరంగ ప్రవేశం చేసాడు. కానీ అఖిల్ నటించి తొలి రెండు చిత్రాలు నిరాశ పరిచాయి. దీనితో ఈ అక్కినేని యువ హీరోపై ఒత్తిడి పెరుగుతోంది. అఖిల్ కు అర్జెంట్ గా ఓ హిట్టు కావాలి. అఖిల్ మూడవ చిత్రం గురించి ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. దర్శకుడు కొరటాల శివ తదుపరి చిత్రం అఖిల్ తో ఉండే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ కాంబినేషన్ సెట్ అయితే అఖిల్ మూడవ చిత్రం ఘనవిజయం ఖాయం అని అంటున్నారు. కానీ అంతలోనే సీన్లోకి నాని ఎంటర్ అయ్యాడనే వార్తలు కూడా వస్తున్నాయి.

 భారీ అంచనాలతో బరిలోకి

భారీ అంచనాలతో బరిలోకి

సినీ ఇండస్ట్రీలో అఖిల్ లాంచింగ్ భారీ అంచనాల నడుమ సాగింది. కానీ అఖిల్ తొలి చిత్రం ఏమాత్రం ప్రేక్షకుల ఆకట్టుకోలేక పోయింది.

 పరవాలేదనిపించినా

పరవాలేదనిపించినా

అఖిల్ రెండవ చిత్రం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చింది. హలొ చిత్రం పరవాలేదనిపించినా అఖిల్ ఆశించిన విజయం మాత్రం ఈ చిత్రం ద్వారా దక్కలేదు.

అఖిల్‌పై ఒత్తిడి

అఖిల్‌పై ఒత్తిడి

తొలి రెండు చిత్రాలు నిరాశ పరచడంతో అఖిల్ పై వత్తిడి పెరిగింది. అక్కినేని అభిమానులు అఖిల్ పై భారీగా ఆశలు పెట్టుకుని ఉన్నారు.

 మూడవ చిత్రం గురించి అదిరిపోయే న్యూస్

మూడవ చిత్రం గురించి అదిరిపోయే న్యూస్

అఖిల్ మూడవ చిత్రం గురించి ఇండస్ట్రీలో అదిరిపోయే వార్తలు వస్తున్నాయి. వరుస విజయాలతో దూకుసుపోతున్న కొరటాల శివ దర్శత్వంలో అఖిల్ నటించబోతున్నట్లు ఈ వార్తల సారాంశం.

 ఎన్టీఆర్‌తో అనుకున్నాడు కానీ

ఎన్టీఆర్‌తో అనుకున్నాడు కానీ

కొరటాల శివ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో భరత్ అనే నేను చిత్రం తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం పూర్తయ్యాక ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయాలని కొరటాల భావించాడు. కానీ ఎన్టీఆర్ త్రివిక్రమ్, రాజమౌళి సినిమాలతో బిజీ కాబోతున్నాడు. దీనితో కొరటాల మరో హీరోని వెతుక్కోవాల్సి వచ్చింది.

 సీన్‌లోకి ఎంటర్ అయిన నాని

సీన్‌లోకి ఎంటర్ అయిన నాని

కొరటాల దర్శకత్వంలో అఖిల్ నటించబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో మరో ఆసక్తికరమైన వార్త కూడా ప్రచారంలోకి వచ్చింది. కొరటాల న్యాచురల్ స్టార్ నానితో సినిమా చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇంతకీ కొరటాల సినిమా చేయబోయేది అఖిల్ తోనా, నాని తోనా తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X