తాత, తండ్రి, మనవడిగా బాలయ్య.. కొరటాల శివ డైరెక్షన్‌లో క్రేజీ ప్రాజెక్ట్!

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. ఇందులోని మొదటి భాగం ఎన్టీఆర్ కథా నాయకుడు సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలయ్య తన తండ్రి ఎన్టీఆర్ పాత్రలో 60కి పైగా గెటప్స్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇదిలా ఉండగా బాలయ్య క్రేజీ చిత్రాలకు రెడీ అవుతున్నాడు. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం విడుదల కాగానే బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో హ్యాట్రిక్ చిత్రం రాబోతోంది. ఏ చిత్రం తరువాత మరో క్రేజీ దర్శకుడికి బాలయ్య కమిట్మెంట్ ఇచ్చారు.

2019లో క్రేజీ చిత్రాలు

2019లో క్రేజీ చిత్రాలు

చూస్తుంటే 2019 నుంచి బాలయ్య భారీ చిత్రాలతో అభిమానులని అలరించబోతున్నాడు. ఎన్టీఆర్ బయోపిక్ నుంచి రెండు భాగాలూ తక్కువ గ్యాప్ లో విడుదల కాబోతున్నాయి. ఫిబ్రవరి నుంచి బాలయ్య, బోయపాటి సినిమా పట్టాలెక్కనుంది. తాజా సమాచారం ప్రకారం పరాజయమే ఎరుగని కొరటాల శివ బాలయ్యని డైరెక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇద్దరి మధ్య అంగీకారం కుదిరిందట.

 మూడు పాత్రల్లో బాలయ్య

మూడు పాత్రల్లో బాలయ్య

బాలయ్య హీరోగా కొరటాల శివ సామజిక సందేశంతో ఓ భారీ చిత్రానికి తెరకెక్కించేందుకు సిద్ధం అవుతున్నాడు. ఈ చిత్రంలో బాలయ్య తాత, తండ్రి, మనవడిగా మూడు పాత్రల్లో కనిపించబోతున్నట్లు సమాచారం. ఎలాంటి పాత్రలో అయినా అద్భుతమైన నటన కనబరిచే బాలయ్య ట్రిపుల్ రోల్ లో అదరగొడతాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను లాంటి చిత్రాలతో కొరటాల శివ తిరుగులేకుండా దూసుకుపోతున్నాడు.

బరువు తగ్గాలి

బరువు తగ్గాలి

బాలయ్య మూడు పాత్రల్లో నటించాలి కాబట్టి బరువు తగ్గాలని కొరటాల శివ సూచించారట. మూడు పాత్రల్లో భిన్నంగా కనిపించేందుకు బరువుతగ్గితే బావుంటుందని కొరటాల చెప్పడంతో బాలయ్య వెంటనే అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. బాలయ్య ఈ చిత్రంలో దాదాపు 20 కేజీలు బరువు తగ్గి కనిపిస్తాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

 మెగాస్టార్‌తో త్వరలో

మెగాస్టార్‌తో త్వరలో

ప్రస్తుతం కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవితో చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధం అవుతున్నారు. జనవరిలో ఈ చిత్రం ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చిరంజీవి ఈ చిత్రంలో రైతు పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఈ చిత్రానికి ఓ నిర్మాతగా వ్యవహరిస్తాడట. ప్రస్తుతం చిరు సైరా నరసింహా రెడ్డి చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X