టైటిల్ పోస్టర్‌లో ఇవి గమనించారా?.. ‘చెక్’పెట్టేందుకు నితిన్ రెడీ!!

హీరో నితిన్ స్పీడ్ చూస్తే ఎవ్వరైనా సరే షాక్ అవ్వాల్సిందే. ఈ ఏడాది భీష్మతో బాక్సాఫీస్ దుమ్ముదులిపిన నితిన్ మరో మూడు చిత్రాలను లైన్‌లో పెట్టేశాడు. మాములుగా అంతా బాగుండి ఉంటే... మూడు నెలల గ్యాప్‌తో నాలుగు సినిమాలతో నితిన్ రచ్చ రచ్చ చేసేవాడు. కానీ కరోనాతో అనుకున్న ప్లాన్స్ అన్నీ తారుమారు అయ్యాయి. అందుకు ఇప్పుడు తన ప్రాజెక్ట్‌లన్నింటిని మళ్లీ లైన్‌లో పెట్టేసి అప్డేట్స్ ఇచ్చేస్తున్నాడు.

భవ్య క్రియేషన్స్‌పై తెరకెక్కబోతోన్న ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్‌ను అక్టోబర్ 1 సాయంత్రం 4 30 గంటలకు విడుదల చేశారు. కొరటాల శివ చేతుల మీదుగా ఈ మూవీ టైటిల్ అండ్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. తనకు ఎంతో ఇష్టమైన దర్శకుడు చంద్రశేఖర్ యేలేటీ అని ఆయన తెరకెక్కిస్తున్న ఈ మూవీ టైటిల్‌ను రిలీజ్ చేయడం ఎంతో ఆనందంగా ఉందని కొరటాల చెప్పుకొచ్చాడు. ఇక ఈ టైటిల్ పోస్టర్‌లోనే ఎన్నో హింట్స్ వదిలారు.

koratala siva Launched nithin Chandra sekhar Project Title is Check

ఇదో మైండ్ గేమ్ లాంటి చిత్రమని పోస్టర్ చూస్తేనే అర్థమవుతోంది. చదరంగంలో అన్నీ కాయిన్స్ పడిపోగా అటు సైడు ఇటు సైడు రాజు మాత్రమే మిగిలి ఉంది. ఇక చెక్ అంటూ వచ్చిన టైటిల్ మధ్యలో గుర్రం బొమ్మ డిజైన్ వచ్చేలా సెట్ చేశారు. చదరంగం ఆటలో గుర్రం ఎంత పవర్‌పుల్ అన్నది అందరికీ తెలిసిందే. చేతికి సంకెళ్లు..కంచె.. ఇలా పోస్టర్‌తోనే మెదడుకు పని పెట్టేశారు. ఈ సినిమాలో రకుల్ ప్రీత్, ప్రియా ప్రకాష్ వారియర్‌తో నితిన్ రొమాన్స్ చేయబోతోన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X