నిజమా?.. ఈ కాంబినేషన్‌లో సినిమానా: నానితో ఎవరో తెలుసా!..
Recommended Video

నేచురల్ స్టార్ నాని యమా స్పీడుగా ఉన్నాడు. నాని సక్సెస్ రేటు చేసి అగ్ర దర్శకులు సైతం ఆయనతో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మొన్నామధ్య దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆయనతో సినిమాకు రెడీ అవుతున్నారని ఊహాగానాలు వెలువడ్డ సంగతి తెలిసిందే.
తాజాగా దర్శకుడు కొరటాల శివ పేరు కూడా తెర పైకి వచ్చింది. త్వరలోనే నానితో కొరటాల శివ సినిమా చేయబోతున్నారన్న గుసగుసలు మొదలయ్యాయి. నిజానికి కొరటాల శివ ఇప్పటికే హీరో రాంచరణ్ కు కథ చెప్పగా.. ఆయన నుంచి మాత్రం గ్రీన్ సిగ్నల్ రాలేదు.

రంగస్థలం పూర్తయ్యాక.. రాంచరణ్ బోయపాటి సినిమా చేయనున్నారు. ఆ సినిమా పూర్తి కావడానికి ఎంత లేదన్నా ఏడెనిమిది నెలలు పడుతుంది కాబట్టి.. ఆలోగా మరో హీరోతో సినిమా చేయాలనేది కొరటాల ప్లాన్. ఎటూ 'భరత్ అనే నేను' పూర్తి కావచ్చింది కాబట్టి నానితో సినిమా చేయాలని భావిస్తున్నాడట.
నాని సినిమాలు కూడా స్టార్ హీరో రేంజ్‌ను అందుకుంటుండటంతో.. అతనితో సినిమా చేయడానికి కొరటాల మొగ్గుచూపుతున్నట్టు టాక్. చూడాలి మరి, ఈ క్రేజీ కాంబినేషన్ ఊహాగానాలకే పరిమితమవుతుందో.. లేక ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందో!


Click it and Unblock the Notifications